న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్ సీజ్

School-Closed

మేడ్చల్: కూకట్‌పల్లిలోని న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్‌ను జిహెచ్‌ఎంసి సిబ్బంది సీజ్ చేశారు. విద్యా సంవత్సరంలో మధ్యలో పాఠశాల మూసివేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేందుతున్నారు. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా చర్యలు తీసుకుంటామని డిఇఒ విజయకుమారి తెలిపారు. న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను సమీప పాఠశాలలో చదివిస్తామని స్పష్టం చేశారు. ఆయా పాఠశాలలతో మాట్లాడి తల్లిదండ్రులపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠ్యాంశాల విషయంలో విద్యార్థులు ఆందోళన చెందనక్కర్లేదని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం న్యూ సెంచరీ స్కూల్  గోడ కూలిపోవడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

Comments

comments