న్యూ డెమోక్రసి దళ కమాండర్ అరెస్టు

New Democracy Commander Arrested

మహబూబాబాద్ : గంగారం మండలం పెద్ద ఎల్లాపురంలో న్యూ డెమోక్రసి దళ కమాండర్ కృష్ణను గురువారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణతో పాటు మరో ఇద్దరు పార్టీ సభ్యులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారి నుంచి మూడు తుపాకులను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. నక్సల్స్ అజ్ఞాత వాసం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు పేర్కొన్నారు. హింసతో సాధించేదేమీ లేదని వారు చెప్పారు.

New Democracy Commander Arrested