న్యూయార్క్‌లో కాల్పులు : నలుగురి మృతి

America : Firing in New York... Four People died

న్యూయార్క్ : న్యూయార్క్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. క్వీన్స్ ప్రాంతంలోని ఆస్టోరియా సెక్షన్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఓ ఐదేళ్ల బాలుడు సహా నలుగురు చనిపోయారు. అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో ఈ దారుణం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు, ఐదేళ్ల బాలుడు మృతుల్లో ఉన్నారు. నలుగురిని తుపాకీతో కాల్చి చంపారు. కుటుంబంలో ఒకరు నలుగురిని హత్య చేసి , ఆపై అతను ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన వారిలో ఓ వ్యక్తి గొంతుకోసి ఉందని, ఘటనాస్థలంలో ఓ తుపాకీ సైతం లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Firing in New York : Four People died