న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రియురాలు

ప్రియురాలి ఆందోళనతో పురుగుల మందు సేవించిన ప్రియుడు రెండు గంటలపాటు అయోమయానికి గురైన పోలీసులు ట్యాంక్ ఎక్కి యువతిని దింపిన గ్రామ యువకుడు మనతెలంగాణ/చందుర్తి: ప్రేమించిన ప్రియుడితో పెళ్ళి చేయాలని పోలీసుల చుట్టూ తిరిగి వేసారిపోయిన ఓ ప్రియురాలు న్యాయం కోసం మంచినీటి ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టింది. సుమారు రెండు గంటలపాటు ట్యాంక్ పైనే ఉండడంతో పోలీసులు దింపాలని ప్రయత్నం చేస్తే ప్రియురాలు మాత్రం ప్రియుడితో పెళ్ళి చేస్తేనే కిందికి దిగుతానని మొండికేసింది. ఈ విషయం తెలిసిన […]

ప్రియురాలి ఆందోళనతో పురుగుల మందు సేవించిన ప్రియుడు
రెండు గంటలపాటు అయోమయానికి గురైన పోలీసులు
ట్యాంక్ ఎక్కి యువతిని దింపిన గ్రామ యువకుడు

మనతెలంగాణ/చందుర్తి: ప్రేమించిన ప్రియుడితో పెళ్ళి చేయాలని పోలీసుల చుట్టూ తిరిగి వేసారిపోయిన ఓ ప్రియురాలు న్యాయం కోసం మంచినీటి ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టింది. సుమారు రెండు గంటలపాటు ట్యాంక్ పైనే ఉండడంతో పోలీసులు దింపాలని ప్రయత్నం చేస్తే ప్రియురాలు మాత్రం ప్రియుడితో పెళ్ళి చేస్తేనే కిందికి దిగుతానని మొండికేసింది. ఈ విషయం తెలిసిన ప్రియుడు వ్యవసాయ పొలం వద్దకు పరుగులు తీసి అక్కడే పురుగు మందును సేవించాడు. ప్రియుడి పురుగుల మందు సేవించాడని చూపించేందుకు ప్రియుని బంధువులు ట్యాంక్ వద్దకు ప్రియున్ని తీసుకవచ్చారు. పురుగుల మందు తాగడాని ట్యాంక్ దిగాలని యువతీని ఎస్‌ఐ కోరిన వినకుండా ప్రియురాలు సత్య ఆమె వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలు మింగింది. ఈ రెండు సంఘటనలు చందుర్తి పోలీసులను కలవరానికి గురిచేశాయి. ట్యాంక్ ఎక్కితే కిందికి దూకుతానని బెదిరింపులకు పోలీసులు ఏమి చేయాల్లో పాలపడుక అయోమయానికి గురయ్యారు. పురుగుల మందు సేవించిన ప్రియున్ని పోలీస్ వాహనంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చివరకు స్థానిక యువకుడే ట్యాంక్ ఎక్కి ఆమెను దింపుకొచ్చాడు. నిద్రమాత్రలు మింగిన ప్రియురాలు సత్యను పోలీసులు ఆటోలో సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రేమ కథ చివరకు పోలీసులకు తలనొప్పిగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు.

పది రోజులుగా న్యాయం చేయాలని…
కామారెడ్డి జిల్లాకు చెందిన మానుక సత్య(22) అనే యువతీ సికింద్రాబాద్‌లోని ఆల్వాల్‌లోని బాలజీనగర్‌లో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంది. ఆమెకు 9మాసాల క్రితం ఇందే కంపెనీలో పనిచేస్తున్న రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన ఏరెడ్డి ప్రశాంత్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసిందని యువతీ జూన్ 21వ తేదిన చందుర్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ప్రియుడు ప్రశాంత్‌రెడ్డి, తండ్రి శ్రీనివాస్‌రెడ్డిని పిలుపించుకొని 23వ తేది కుమారుడు ప్రశాంత్‌రెడ్డిని తీసుకవస్తానని చెప్పి తీసుకవచ్చాడు. ఇదే రోజున కొందరు పెద్దల సమక్షంలో అమ్మాయికి రూ.2లక్షల డబ్బులు ఇచ్చేందుకు తీర్మానం చేశారని మండల కేంద్రంలో చర్చించుకుంటున్నారు. ఇందుకు ప్రియురాలు సత్య పెళ్ళి చేసుకునేందుకే ప్రేమించానని పెద్దలకు తేల్చి చెప్పింది.
దీంతో పోలీసులు అబ్బాయిని ప్రేమించినట్లు ఆధారాలు తేవాలని చెప్పారు. జూన్ 26వ తేదిన చందుర్తి పోలీస్టేషన్‌కు చేరుకున్న ప్రియురాలు సత్య తనకు న్యాయం జరగడం లేదని ఠాణాలోనే నిద్రమాత్రలు మిగింది. వెంటనే పోలీసులు సిరిసిల్లలో చికిత్స చేయించారు. 27న సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో న్యాయం చేస్తానని ప్రియుడు బంధువులతో చెప్పి ప్రియురాలను పంపించారు. పోలీసులు, ప్రియుడు బంధువుల మాటలపై నమ్మకం లేని ప్రియురాలు ఆదివారం మర్రిగడ్డ గ్రామంలోని మంచినీటి ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగింది. ఈ విషయం తెలిసిన చందుర్తి ఎస్‌ఐ మల్లేశ్‌గౌడ్ మర్రిగడ్డకు చేరుకుని ప్రియురాలు సత్యను దిగమని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయాన్ని చందుర్తి సిఐ విజయ్‌కుమార్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి సిఐ చేరుకొని ట్యాంక్ దిగాలన్న వినిపించుకోలేదు. ప్రియుడు ప్రశాంత్‌రెడ్డికి ఈ విషయం తెలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి అక్కడే పురుగుల మందు సేవించాడు. అయిన ఆందోళన స్థలానికి ప్రశాంత్‌రెడ్డిని తీసుకరావాలన్న పోలీసుల ఆంక్షలతో బంధువులు మోటర్ సైకిల్ పై తీసుకవచ్చారు. ప్రియురాలికి ప్రియుడు ప్రశాంత్‌రెడ్డి పరిస్థితిని చూపించి వెంటనే పోలీసు జీపులో చికిత్స కోసం వేములవాడ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇది చూసిన ప్రియురాలు సత్య ఆమె చేతి బ్యాగ్‌లో ఉన్న నిద్రమాత్రలు తీసుకొని ట్యాంక్ పైనే మింగింది. దీంతో పోలీసులకు ఏమి చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు.
ట్యాంక్ ఎక్కితే కిందికి దూకుతానన్న బెదిరింపులతో పోలీసులు హైరానా పడ్డారు. చివరకు స్థానిక యువకుడు కిరణ్ చాకచక్యంతో ప్రియురాలు కళ్ళు గప్పి ట్యాంక్ ఎక్కి యువతిని కిందికి తీసుకవచ్చాడు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకొని సత్యను చికిత్స నిమిత్తం ఆటోలో సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుని ధైర్యాన్ని గ్రామస్థులు అభినందించారు.

Comments

comments

Related Stories: