నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలి

మనతెలంగాణ/జన్నారం: నేర నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని మంచిర్యాల ఏసిపి గౌస్‌బాబా కోరారు. శనివారం జన్నారం మండల కేంద్రం లోని పిఆర్‌టియు భవనంలో జరిగిన నిఘా నేత్రంలో భాగం గా నేను సైతం సిద్దం అనే కార్యక్రమంలో ఏసిపి గౌస్ బాబాపాల్గొని ప్రజలనుఉద్దేశించి మాట్లాడారు. మండల కేంద్రంలో పాటు గ్రామాల్లో గతంలో అనేక దొంగత నాలు జరిగేవని రోజు రోజుకు వస్తున్న మార్పుల కార ణంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకొని దొంగతనాలను నివారించడం జరుగుతుందన్నారు. సిసి […]

మనతెలంగాణ/జన్నారం: నేర నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని మంచిర్యాల ఏసిపి గౌస్‌బాబా కోరారు. శనివారం జన్నారం మండల కేంద్రం లోని పిఆర్‌టియు భవనంలో జరిగిన నిఘా నేత్రంలో భాగం గా నేను సైతం సిద్దం అనే కార్యక్రమంలో ఏసిపి గౌస్ బాబాపాల్గొని ప్రజలనుఉద్దేశించి మాట్లాడారు. మండల కేంద్రంలో పాటు గ్రామాల్లో గతంలో అనేక దొంగత నాలు జరిగేవని రోజు రోజుకు వస్తున్న మార్పుల కార ణంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకొని దొంగతనాలను నివారించడం జరుగుతుందన్నారు. సిసి కెమెరాల ఏర్పాటుతో తమ ఇండ్లలో ఉన్నబంగారు ఆభరణాలతోపాటు విలువైన వస్తువులకు రక్షణ ఉం టుందని ఈవిషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.రాష్ట్ర రాజధాని లోని హైదరాబాద్‌లో ఎలాంటి దొంగతనాలు జరిగినవెంటనే పట్టుబడే అవ కా శంఉందని, ఎక్కడ చూసినా సిసి కెమెరాలను ఏర్పాటుచేయడం వల్లనే దొంగలు పారిపోవడం ఉండదన్నారు. అదే తరహాలో ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద సిసికెమెరాలను ఏర్పాటుచేసుకోవాలని,ప్రతిఒక్కరు సహకరించు కోవాలని కోరా రు. పెద్దపెద్ద వ్యాపారస్థులు మాత్రంతప్పకుండా తమ షాపుల ముందు కెమెరా లను ఏర్పాటు చేసుకొని ఇతరులకు ఆదర్శం గానిలువాలన్నారు. సిసి కెమెరాల ఏర్పాటు కోసం వ్యాపారులు,స్వచ్ఛందసంస్థలు సహకరిస్తేనే సాధ్యమవుతుందని, ఈ కార్యక్రమానికి ఒక కమిటీ సైతం ఏర్పాటుచేసి వారి ఆధ్వర్యంలోనే ముఖ్య మైన కూడళ్లవద్ద కెమెరాలను ఏర్పాటుచేయడం జరుగుతుందని పోలీస్‌శాఖ సూచ న లు, సలహాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహా య సహకారాలు అందిస్తామని పలువురు వ్యాపారులు ముక్త కంఠంతో హామీ ఇచ్చారు. ఈసమావేశంలో లక్షెట్టిపేట సిఐ శ్రీనివాస్, జన్నారం ఎస్‌ఐ తహిసి నో ద్దీన్, అదనపు ఎస్‌ఐ ఫరీద్, వర్తక సంఘం అధ్యక్షులు బండారు మారుతి, పొన్కల్ ఉప సర్పంచ్ గుండాసుధాకర్, వ్యాపారులు కె.ఎ.నర్సింహులు, కాశెట్టి లక్ష్మణ్, బండారిరాజన్న,కమ్మలరవి, జక్కురమేష్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: