నేరాల నియంత్రణకు నిఘానేత్రాలు

Police1

ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మం డలంలో నేరాలు, రహదారి ప్రమాదాల నివారణ కోసం నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్పీ సుధాకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం ఆయన మండ లంలోని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో సమా వేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ మండల పరిధిలోని వెంకటాపూర్ నుండి తిమ్మాపూర్ గ్రామ శివారు వరకు ఉన్న ప్రధాన రహదారితో పాటు సమస్యాత్మకమైన పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయదలచి నట్లు తెలిపారు. మొత్తం 13చోట్లవీటిని ఏర్పాటు చేయడానికి దాదాపు. 7.5 లక్షలు ఖర్చు కానున్న ట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట సిఐ రవీం దర్, ఎస్సై ఉపేందర్, జడ్పీటీసీ తోట ఆగయ్య, ఏఎంసి చైర్మన్ అందె సుభాష్, మాజీ ఎంపిపి ఎలు సాని మోహన్‌కుమార్, ఆయా గ్రామాల సర్పం చ్‌లు, ఎంపిటిసిలు, సామాజిక కార్యకర్త నేవూరి వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రామగిరిలో: నేరాల నియంత్రణకు నిఘా నేత్రాల ( సిసి కెమరాల)ను రామగిరి మండల పరిదిలోని లద్నాపూర్, నాగెపల్లి, పన్నూర్, సెంటినరికాలనీ తెలంగాణ చౌరస్తా, కల్వచర్ల బస్టాండ్‌లలో 32 సిసి కెమరాలను ఏర్పాటు చేయడం జరిగిందని రామ గిరి ఎస్‌ఐ శంకర్ యాదవ్ తెలిపారు. ఆదివారం రామగిరి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ మండల పరిదిలోని అన్ని గ్రామాలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

Comments

comments