నేపాల్‌లో ఇద్దరు భారతీయులు గల్లంతు

Two Indians go missing while fishing in Nepal

ఖాట్మండు: నేపాల్‌లోని సింధుపాల్‌చోక్ జిల్లాలో ఉన్న సన్కోషి నదీ ప్రవాహంలో ఇద్దరు భారతీయులు కొట్టుకుపోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. ఖాట్మండుకు 75 కిమీ. దూరంలో బహారబిసె ప్రాంతంలో ఉన్న నదిలో వారు చేపలు పడుతూ గల్లంతయ్యారు. వారిని రూప్‌లాల్ సహానీ(30), మనోహర్ సహానీ(25)గా గుర్తించారు. వారు బీహార్‌లోని సీతామడీ జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు. గల్లంతయిన వారికోసం గాలిస్తున్నట్లు తెలిపారు.