నేను గర్భవతిని కాను: ఇలియానా

ileana

ముంబయి: కథానాయిక ఇలియానా ‘నేను గర్భవతిని కాను’ అని స్పష్టం చేశారు. ఆమె గర్భంతో ఉన్నారని గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో  తెగ ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఆమె వదులు దుస్తులు ధరించి, బయటికి వస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అయితే కొన్ని రోజులు ఈ విషయంపై మౌనంగా ఉన్న ఇలియానా తాజాగా స్పందించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. “నేను గర్భవతిని కాను” అని చెప్పారు. ఇలియానా, ఆండ్రూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే  ఆండ్రూను భర్త అని పిలుస్తూ పలుమార్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. దీంతో వీరి వివాహం రహస్యంగా జరిగిందని ప్రచారం జరిగింది. దీనిపై ఇలియాను ప్రశ్నించగా.. ‘వ్యక్తిగత విషయాలను పంచుకోవడం నాకు ఇష్టం లేదు’ అని చెప్పారు.

Comments

comments