నేను గర్భం దాల్చలేదు: శిల్పాశెట్టి

Im not pregnant says Shilpa Shetty

హైదరాబాద్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గర్భం దాల్చిందని సోషల్‌ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా ఓ డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌ నుంచి రిపోర్ట్స్‌తో బయటకు వస్తున్న ఆమె ఫొటో సైతం నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ విషయంపై అభిమానులు #ShilpaKoKyaHua ట్యాగ్‌తో ఆమెను ప్రశ్నిస్తున్నారు. దీంతో శిల్పాశెట్టి అభిమానుల ప్రశ్నకు సమాదానం ఇచ్చారు. తను గర్భం దాల్చిందంటూ వస్తున్న వార్తలో నిజం లేదని ఆమె  అన్నారు. రెగ్యూలర్‌ చెకప్‌లో భాగంగానే నా శరీరానికి సంబంధించిన పరీక్షలను ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నస్టిక్స్‌లో చేయించుకున్నానని ఆమె తెలిపారు. నేను ప్రెగ్నెంట్‌ను కాదని ట్వీట్‌ చేశారు.

Comments

comments