నేతన్నలకు అండగా ఉంటాం : కెటిఆర్

Hyderabad : Our Support for Weavers: Minister KTR

హైదరాబాద్ : తెలంగాణ చేతనే కార్మికులకు అండగా ఉంటామని మంత్రి కెటిఆర్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. చేనేత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. నాలుగేళ్లుగా చేనేత కార్మికులకు ఆర్థిక సాయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పోచంపల్లి, దుబ్బాక, గద్వాల్, కొత్తకోట, కరీంనగర్‌లలోని చేనేత కార్మికులకు అండగా ఉంటున్నామని చెప్పారు. చేనేత వస్త్రాలను ధరించి, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Our Support for Weavers: Minister KTR