నేడే కీలక కేబినేట్

CM Kcr Meet With SK Joshi in Pragathi Bhavan

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఉదయం 9 నుంచి అందుబాటులో ఉండాలని మ్ంరత్రులకు సమాచారం
సిఎస్, ఇతర ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపిన సిఎం

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి సహా ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ తదితరులతో ప్రగతిభవన్‌లో బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కెసిఆర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. గురువారం ఉదయం మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. పరిపాలనా సంబంధమైన అంశాలతో పాటు శాసనపరమైన వ్యవహారాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై నిర్ణయా లు జరిగిన తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ను కలిసి చర్చ లు జరపనున్నట్లు తెలిసింది. అనంతరం అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నట్లు సమాచారం. ఉదయం తొమ్మిది గంటల నుంచి మంత్రులు అందుబాటులో ఉండాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇప్పటికే సమాచారం వెళ్ళినట్లు తెలిసింది. మధ్యాహ్నం మంత్రి మండలి సమావేశం ఉండవచ్చని సమాచారం. ఈ సమావేశంలో ‘పొలిటికల్’ అంశాలు కూడా ఉండే అవకాశం ఉందని తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే విషయంలో ఇప్పటికే మంత్రుల ఆమోదం కోసం ఫైల్‌ను సర్కులేషన్ పద్ధతిలో పెట్టినట్లు తెలిసింది. కేబినెట్ భేటీకి సంబంధించిన అంశాల ను స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మధ్యాహ్నం ప్రెస్ మీట్‌లో పాత్రికేయులకు వివరించే అవకాశం ఉంది.

Comments

comments