నేడు మంత్రి హరీశ్‌రావు పర్యటన

Minister Harish Rao today visited Siddipet

మనతెలంగాణ/సిద్దిపేట కలెక్టరేట్ : రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ నెల 29న సిద్దిపేట నియోజక వర్గంలో పర్యటించి అనేక అభివృద్ధ్దికార్యక్రమాలలో పాల్గొననున్నారు. 1.30 గంటలకు చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో అంగన్‌వాడి, మహిళా మండలి, యాదవ, ముదిరాజ్ కమ్యూనీటిహాల్స్, జిల్లా పరిషత్ హైస్కూల్‌లో అదనపు గదులను ప్రారంభించనున్నారు. 2.30 గంటలకు గంగాపూర్‌లో అంగన్‌వాడీ భవనాన్ని, మార్కెట్ యార్డును, గోర్రెల షెడ్‌ను ప్రారంభించనున్నారు. మద్యాహ్నం 3.30గంటలకు గుర్రాలగొంది గ్రామంలో సోషల్ వెల్ఫేర్ హస్టల్ ప్రారంభోత్సవానికి భూమిపూజ, పాఠశాల అదనపు గదులను, పెద్దరాముని చెరువు మరియు ముస్లీం కమ్యూనీటి హాల్‌ను, విజయ మిల్క్ సెంటర్, రైతుబజార్, ఓపెన్‌జీమ్, ఫంక్షన్‌హల్, 4.40 గంటలకు మల్యాల గ్రామంలో ముదిరాజ్, గంగపుత్ర సంఘం కమ్యూనీటీహాల్స్ ప్రారంభించనున్నారు.

Comments

comments