నేడు కాగజ్‌నగర్‌లో కెటిఆర్ పర్యటన

ఎస్పీఎం క్రీడా మైదానంలో భారీ బహిరంగ సభ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి పేపర్ మిల్లు స్టాఫ్ గేట్ ముందు మంత్రి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు మిషన్ భగీరథ నీటిని విడుదల చేయనున్న మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/కాగజ్‌నగర్: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ గురువారం కాగజ్‌నగర్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. బేగంపేట విమానాశ్రయం నుండి మంత్రి […]

ఎస్పీఎం క్రీడా మైదానంలో భారీ బహిరంగ సభ
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
పేపర్ మిల్లు స్టాఫ్ గేట్ ముందు మంత్రి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు
మిషన్ భగీరథ నీటిని విడుదల చేయనున్న మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/కాగజ్‌నగర్: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ గురువారం కాగజ్‌నగర్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. బేగంపేట విమానాశ్రయం నుండి మంత్రి కెటిఆర్ ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం  9.35 గంటలకు బయలుదేరి ఉదయం 10.30 గంటలకు కాగజ్‌నగర్ మండలం కోసిని డాడానగర్‌లోని ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగనున్నారు. అక్కడ నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో 10.45 గంటలకు మిషన్ భగీరథ పైపు లైన్ ద్వారా మంచినీటిని విడుదల చేయనున్నారు. 11 గంటలకు మున్సిపాలిటీ పరిధిలోని బి  ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. 11.15 గంటలకు 10 కోట్ల రూపాయల నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. 11.30 గంటలకు ఎస్పీఎం స్టాఫ్ గేట్ వద్ద పూజ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.

12.15గంటలకు చింతగూడ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎస్పీఎం క్రీడా మై దానంలో గల జీడి బంగ్లాలో భోజనం  చేస్తారని, 1.45 గంటలకు ఎస్పీఎం క్రీడా మైదానంలో జరిగే కార్మికుల, ప్రజల భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని వారు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి కోసిని డాడానగర్ హెలిప్యాడ్‌కు చేరుకొ ని హైద్రాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, పేపర్ మిల్లు పునరుద్ధరణకై వస్తున్న మంత్రి కెటిఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు కార్మికులు, కార్మిక కుటుంబాలు, రైతులు, పట్టణ ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మూతబడిన పేపర్ మిల్లును పునః ప్రారంభించేందుకు ప్రత్యేక చొరవ చూపిన మంత్రి కెటిఆర్, తీవ్ర కృషి చేసిన కోనేరు కోనప్పలకు మంగళహారతులతో స్వాగతం పలికేందుకు పె ద్ద ఎత్తున మహిళలు ఎస్పీఎం స్టాఫ్ గేట్‌కు చేరుకోనున్నారు.

మంత్రి కెటిఆర్ పర్యటనను జయప్రదం చేయడానికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కో నప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిర్పూర్ నియోజకవర్గం న లు మూలల నుండి వచ్చే ప్రజల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు ఏ ర్పాటు చేయడమే కాకుండా భోజన, మంచినీటి సౌకర్యాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం నుండే వేలాది మంది కోసం వంటలను తయారు చేసే ప్రక్రియను ప్రారంభించారు. మరో వైపు జిల్లా ఉ న్నతాధికారులు, స్థానిక అధికారులు ఎస్పీఎం క్రీడా మైదానం వద్ద మకాం వేసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కాగా, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ కాగజ్‌నగర్ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.

Comments

comments

Related Stories: