నేడు ఈద్-ఉల్-ఫితర్

మసీదులు,ఈద్గాల వద్ద ప్రార్ధనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు మనతెలంగాణ/జగిత్యాల: ముస్లీంలు నెల రోజుల పాటు పవిత్ర ఉపవాసాలతో గడిపే రంజాన్ ముగింపు రోజు ఈద్ ఉల్ ఫితర్‌ను నేడు ఘనంగా జరుపుకోనున్నారు. గత నెల రోజులుగా కఠిన ఉపవాస దీక్షలు, ప్రతి రోజు ఐదు సార్లు నమాజుతో పాటు మతగురువు ఆధ్వర్యంలో రోజుకో అధ్యాయం చొప్పున ఖురాన్‌ను పఠించారు. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో శనివారం ఈద్ ఉల్ ఫితర్‌ను ఘనంగా జరుపుకునేందుకు ముస్లీం సోదరులు […]

మసీదులు,ఈద్గాల వద్ద ప్రార్ధనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

మనతెలంగాణ/జగిత్యాల: ముస్లీంలు నెల రోజుల పాటు పవిత్ర ఉపవాసాలతో గడిపే రంజాన్ ముగింపు రోజు ఈద్ ఉల్ ఫితర్‌ను నేడు ఘనంగా జరుపుకోనున్నారు. గత నెల రోజులుగా కఠిన ఉపవాస దీక్షలు, ప్రతి రోజు ఐదు సార్లు నమాజుతో పాటు మతగురువు ఆధ్వర్యంలో రోజుకో అధ్యాయం చొప్పున ఖురాన్‌ను పఠించారు. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో శనివారం ఈద్ ఉల్ ఫితర్‌ను ఘనంగా జరుపుకునేందుకు ముస్లీం సోదరులు సమాయత్తమయ్యారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్బంగా ముస్లీం సోదరులు ప్రార్ధనలు చేయనున్న నేపథ్యంలో ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాత్రి నెల వంక కనిపించగానే ముస్లీం సోదరులు చాంద్ ముబారక్ అంటూ ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లీం సోదరుల ఇళ్లలో శుక్రవారం రాత్రి నుంచే పండగ వాతావారణం కనిపించింది.

Related Stories: