నెలలు గడుస్తున్నా పెన్షన్ రాలేదు..

Old age pension for Non Pensioners
సూర్యపేట్: రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికి పెన్షన్‌లు ఇవ్వాలనే ధ్యేయంతో దరఖాస్తు చేసుకున్న అర్హులైనవారికి పెన్షన్‌లు అందిస్తున్నా కొంత మంది అర్హులకు అధికారుల నిర్లక్షంతో పెన్షన్‌ల మంజూరులో జాప్యం జరుగుతోంది. తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన బాధితురాలు నారాయణదాసు దుర్గమ్మ తెలిపిన వివరాల ప్రకారం… తనకు గతంలో అభయహస్తం కింద పెన్షన్ రూ.500 వచ్చేవని అవి రావడం లేదని అంతేకాకుండా తన భర్త నారాయణదాసు సాయిలు చనిపోయి 10 నెలలు కావస్తోందని తనకు విడో పెన్షన్ కాని వృద్ధాప్య పెన్షన్ కానీ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పెన్షన్ మంజూరు చేయాలని తుంగతుర్తిలో సంబంధింత కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని నెలలు దాటుతున్నా ఇంత వరకు పెన్షన్ రాలేదని తెలియజేశారు. అటు కార్యాలయం చుట్టూ ఇటు పోస్టాఫీసు చుట్టు తిరుగుతున్నానని తన గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని దుర్గమ్మ వాపోయారు. ఇప్పటికైనా అధికారులు తన విషయాన్ని పరిశీలించి పెన్షన్ మంజూరు అయ్యేలా చూడాలని కోరింది.

Comments

comments