నెట్టింట్లో పాక్ రైల్వే అధికారి లీవ్ లెటర్ హల్‌చల్!

ఇస్లామాబాద్: దాయాది పాకిస్థాన్ కు చెందిన రైల్వే అధికారికి సంబంధించిన లీవ్ లెటర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇది అంతలా హల్ చల్ చేయడానికి కారణం సదరు అధికారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 730 రోజులు సెలవు కావాలనే కోరడమే. వివరాల్లోకి వెళితే… హనీఫ్ గుల్ పాక్ రైల్వే డిపార్ట్ మెంట్ లో గ్రేడ్ 20 అధికారి. ఉద్యోగం పట్ల నియబద్ధతగా ఉండే హనీఫ్ కు కొత్తగా రైల్వే మంత్రిగా […]

ఇస్లామాబాద్: దాయాది పాకిస్థాన్ కు చెందిన రైల్వే అధికారికి సంబంధించిన లీవ్ లెటర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇది అంతలా హల్ చల్ చేయడానికి కారణం సదరు అధికారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 730 రోజులు సెలవు కావాలనే కోరడమే. వివరాల్లోకి వెళితే… హనీఫ్ గుల్ పాక్ రైల్వే డిపార్ట్ మెంట్ లో గ్రేడ్ 20 అధికారి. ఉద్యోగం పట్ల నియబద్ధతగా ఉండే హనీఫ్ కు కొత్తగా రైల్వే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న షేక్ రషీద్ పనితీరు నచ్చడం లేదట. రైల్వే మంత్రిగా పనిచేయడానికి ఆయనకు అసలు అర్హతనే లేదంటూ గుల్ ఆరోపిస్తున్నాడు. సదరు మంత్రితో కలిసి తాను పనిచేయలేనని తనకు సెలవులు కావాలంటూ తన పై అధికారికి హనీఫ్ లీవ్ లెటర్ రాశారు. తనకు ఏకంగా 730 రోజులు సెలవు కావాలని, అది కూడా పూర్తి వేతనంతో కూడిన లీవ్ మంజూరు చేయాలని అందులో పేర్కొన్నారు. ఒకవేళ రెండేళ్ల తర్వాత మంత్రి తీరు మారితే అప్పుడు ఉద్యోగంలో చేరే విషయాన్ని ఆలోచిస్తానని పేర్కొనడం గమనార్హం. ఈ విషయం కాస్తా మీడియాకు తెలియడంతో వైరల్ అయింది. గుల్ లీవ్ లెటర్ సోషల్ మీడియాకు చేరడంతో తెగ హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు హనీప్ పనితీరుకు ఈ లెటర్ నిదర్శనమని అతడిని మెచ్చుకుంటున్నారు.

Comments

comments

Related Stories: