నెక్స్ట్ మూవీ సిద్ధమవుతోంది

బ్లాక్‌బస్టర్ మూవీ ‘భరత్ అనే నేను’   ఇచ్చిన ఉత్సాహంతో మహేష్‌బాబు జోరు మీదున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తున్నాడు. దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో భారీ షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా నడుస్తుండగానే మరో సినిమాను కూడా మహేష్ సిద్ధం చేస్తున్నాడు. తన తదుపరి చిత్రాన్ని సుకుమార్‌తో తీస్తానని ఇప్పటికే […]

బ్లాక్‌బస్టర్ మూవీ ‘భరత్ అనే నేను’   ఇచ్చిన ఉత్సాహంతో మహేష్‌బాబు జోరు మీదున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తున్నాడు. దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో భారీ షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా నడుస్తుండగానే మరో సినిమాను కూడా మహేష్ సిద్ధం చేస్తున్నాడు. తన తదుపరి చిత్రాన్ని సుకుమార్‌తో తీస్తానని ఇప్పటికే అతను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ సక్సెస్‌తో తెలుగు నేటివిటీ సినిమాలకు కొత్త భాష్యం చెప్పిన సుకుమార్… మహేష్ కోసం ఆసక్తికరమైన కథను సిద్ధం చేశాడట. మహేష్ 25వ సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్రం మొదలవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ కూడా ఖరారైందని టాక్. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్టు తెలిసింది. స్పైడర్ సినిమాలో మహేష్‌తో కలిసి నటించిన రకుల్ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో నిరుత్సాహపడింది. ఆ సమయంలోనే మహేష్ మరో సినిమాలో అవకాశం ఇస్తానని రకుల్‌కు మాట ఇచ్చాడట. ఆ ప్రకారం సుకుమార్ సినిమాలో ఛాన్స్ ఇప్పించాడనే ప్రచారం జరుగుతోంది. సినిమా మొదలైతే కానీ పూర్తి తారాగణం ఎవరనేది తెలియదు.

Comments

comments

Related Stories: