నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఉపాధి అవకాశాలు

Employment Opportunities Through New Industrial Policy

టిఎస్‌ఐపాస్‌తో వేగంగా అనుమతులు
తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పడానికి బారులు తీరుతున్న పారిశ్రామికవేత్తలు
3500 కొత్త పరిశ్రమలు, 500లకు పైగా ఉత్పత్తులు
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

మన తెలంగాణ/సూర్యాపేట టౌన్ : నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిరూపించారని రాష్ట్ర విద్యుత్తు, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, పురపాలక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రశంగించారు. జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన జాబ్‌మేళాలో మంత్రి మాట్లా డు తూ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికే తెలంగాణ ప్రభుత్వం టిఎస్‌ఐపాస్ అమల్లోకి తెచ్చిందన్నారు. టిఎస్‌ఐపాస్‌తో ప్రపంచంలోని నలుమూలల నుండి పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్ర మలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. సింగిల్‌విండో, విత్ ఔట్ గ్రిల్స్ అన్న పద్ధతిలో టిఎస్‌ఐపాస్ రూపొందిందన్నారు. సింగిల్ మెయిల్‌తో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నా మన్నారు. అనుమతుల విషయంలో ఆలస్యమైతే అధికారులకు జరిమా నా విధించడం జరుగుతుందన్నారు. మెయిల్ చేసిన పారిశ్రామిక వేత్త ఇళ్లకే అనుమతి పత్రాలు ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే   దక్కుతుందన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా చేపట్టిన టిఎస్‌ఐపాస్ విధానం ద్వారా పారిశ్రామికవేత్తలు   తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పేందుకు బారులు తీరుతు న్నారని చెప్పారు.

పారిశ్రామిక విధానం ప్రోత్సాహకరంగా ఉంటే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని అన్న భావనతో కేసీఆర్ టిఎస్‌ఐపాస్‌కు పదునుపెట్టారని చెప్పారు. ఈ విధానం వలన తెలంగాణలో ఇప్పటి వరకు 3500 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, 500ల కు పైగా ఉత్పత్తులు జరుగుతున్నాయన్నారు. కొత్త రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ పరిశ్రమలతో ఇప్పటి వరకు 40 వేల పైబడి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయన్నారు. మానవ వనరు లు అత్యంత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశ మన్నారు. 2024 నాటికి భారతదేశంలో 25 కోట్ల మంది యువతీ, యువకులు ఉపాధి కల్పన కోసం ఉంబబో తున్న ట్లు ఘణాం కాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. చదువు అంటే ఉపాధి కోసమని, ఉపాధి అంటే ప్రభుత్వ ఉద్యోగం అన్న భ్రమలో యువతీ, యువకు లు ఉండటం కొద్దిగా ఆలోచించాల్సిన, ఆందోళన పడాల్సిన విష యమన్నారు. ప్రస్తుతం యావత్తు ప్రపంచం ఉపాధి కల్పన సమస్యలు ఎదుర్కొంటుందన్నారు. ఇంకా జిల్లా కలెక్టర్ సురేంద్రమోన్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళి క ప్రకాశ్, మార్కెట్ ఛైర్మన్ వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధా లయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు, జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవరెడ్డి, నిరు ద్యోగులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీలలో ఉపాధి కోసం దరఖాస్తులు స్వీకరించి పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు.

Comments

comments