నూతన చట్టం అమల్లోకి తీసుకొచ్చాం

గ్రామాలను బాగుచేసుకునేందుకే నూతన చట్టం అమల్లోకి తీసుకొచ్చాం నూతనంగా ఏర్పడనున్న గ్రామ పంచాయతీలను అభివృద్ధిలో ముందుంచుతాం సర్పంచ్‌ల గౌరవం పెంచే విధంగా అధికార బాధ్యతలు కల్పిస్తాం ఎంఎల్‌ఎ చిన్నారెడ్డితో కలిసి పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మన తెలంగాణ/పెద్దమందడి : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి […]

గ్రామాలను బాగుచేసుకునేందుకే నూతన చట్టం అమల్లోకి తీసుకొచ్చాం

నూతనంగా ఏర్పడనున్న గ్రామ పంచాయతీలను అభివృద్ధిలో ముందుంచుతాం
సర్పంచ్‌ల గౌరవం పెంచే విధంగా అధికార బాధ్యతలు కల్పిస్తాం
ఎంఎల్‌ఎ చిన్నారెడ్డితో కలిసి పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/పెద్దమందడి : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం వనపర్తి ఎంఎల్‌ఎ డా.జి.చిన్నారెడ్డితో కలిసి పెద్దమందడి మం డల పరిధిలోని మనిగిళ్ల, మద్దిగట్ల, వెల్టూర్, గట్లఖానాపూర్, పామిరెడ్డిపల్లి గ్రామాల్లో పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పెద్దమందడి, గ్రామంలో సింగిల్ విండో కార్యాలయాన్ని డిసిసిబి చైర్మన్ వీరారెడ్డి, దొడగుంటపల్లిలో అంగన్‌వాడీ, గోపాలమిత్ర భవనాలను ప్రారంభించా రు. అనంతరం పామిరెడ్డి పల్లి గ్రామంలోని రచ్చకట్ట దగ్గర నిరంజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాండాలను, అనుబంధ గ్రామాలను అభివృద్ధిలో ముం దుంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 500 జనాభా కల్గిన తాండాలను, ఆవాసప్రాంతాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. సర్పంచులుగా ఎన్నికైన వారి గౌరవం పెంచేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులను తీసుకొచ్చేందుకు బడ్జెట్ లో వారికి నిధులు కెటాయించిందని తెలిపారు. సర్పంచ్‌లుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు,సామాజికసేవచేసే ఉద్దేశ్యంతో ప్రజా సేవలకు అంకితం కావాలని విధిగా గ్రామాల్లో విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు, సాగునీరు, సకల సౌకర్యాలు అభివృద్ధి చేసేవిధంగా వారి పని తీరు ఉండాలన్నారు. మొక్కలను పెంచి వాటి ని కాపాడాల్సిన బాధ్యత కూడా సర్పంచ్‌లే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయో గించుకొని గ్రామాలు అభివృద్ధిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఏడాది, ఈ ఏడాది వనపర్తి నియోజక వర్గంలోని 38 గ్రామ పంచాయతీల భవన నిర్మాణాలకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి దయాకర్,జడ్పిటిసి వేణుగోపాలకృష్ణ, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి, పిఎసిఎస్ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షులు మేఘారెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు ఐ.సత్యారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజప్రకాష్ రెడ్డి,జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షులు కురుమూర్తి యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుమార్ యాదవ్, సర్పంచ్‌లు మద్దిలేటి, శ్రీనివాసులు, చెన్నకేశవులు, వెంకటేష్, బాల్‌చంద్రయ్య, వెంకట్‌నాయక్, సుగుణమ్మ మన్నెపురెడ్డి, ఎంపిటిసిలు సత్యారెడ్డి, నర్సింహ్మారెడ్డి, నాగేందర్ రావు,జిల్లా గొర్రెల పెంపకం దారుల డైరెక్టర్ నాగేంద్రం యాదవ్, నాయకులు బుచ్చిలింగం, తదితరులు ఉన్నారు.

Comments

comments