నువ్వే నా భర్తంటూ బీటెక్ విద్యార్థినికి మహిళ వేధింపులు..!

Woman harassing Teenager in the name of husband
ఇదో వింత సంఘటన. 35 ఏళ్ల  ఓ వివాహిత 22 ఏళ్ల యువతిని ‘గత జన్మలో నువ్వే నా భర్త. ఇప్పుడు కూడా నువ్వు నాతోనే ఉండాలి’ అంటూ వేధింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కొన్ని రోజులుగా ఆమెతో తనకు పరిచయం ఉందని, కానీ ఉన్నట్టుండి తనను నీవే నా భర్త అంటూ వేధించడం పట్ల ఆందోళనకు గురైన యువతి తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముంబయికి చెందిన వెరోనికా బరోడే అనే వివాహితకు టాటా మెమోరియల్‌ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఇండోర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ పరిచయంతో వారిద్దరూ ఫోన్‌ నంబర్లు మార్చుకున్నారు. గత కొంతకాలంగా యువతి క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని చూసుకునే క్రమంలో ముంబయిలోనే ఉంటుంది. దీంతో వివాహిత ఆమెకు తరచుగా ఫోన్‌ చేయడం, పిచ్చి పిచ్చి మాటలతో ఇబ్బంది పెట్టడం చేస్తోంది. మొదట మహిళ వ్యవహారాన్ని అంతగా పట్టింకోలేదు యువతి. అయితే రోజురోజుకు ఆమె వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో ఒకసారి యువతిని ఏకంగా అపహరించేందుకు కూడా యత్నించిందామె. కానీ, యువతి చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు పట్టించింంది. పోలీసుల విచారణలో వివాహిత చెప్పిన కారణం విని విస్తుపోవడం వారి వంతైంది. గత జన్మలో ఆ యువతి తనకు భర్త అని, ఇప్పుడు కూడా ఆమె నాతోనే జీవించాలని, అందుకే ఆమెను కిడ్నాప్ చేసేందుకు యత్నించినట్లు చెప్పుకొచ్చింది. దాంతో పోలీసులకు ఆమె ఏం మాట్లాడుతుందో కూడా కాసేపు అర్థం కాలేదు. అంతటితో ఆగన మహిళ ‘నువ్వే నా భర్తవు. మనమిద్దరం కలిసుందాం’ అంటూ అక్కడే ఉన్న యువతిని మరోసారి వారించింది. దాంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారని తెలిసింది.

Comments

comments