నీట్‌లో ర్యాంక్ రాలేదని యువతి మృతి

వీణవంక: వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామ శివారులోని నర్సింహులపల్లి గ్రామానికి చెందిన బొబ్బల సంకీర్తన(17) అనే విద్యార్థిని నీట్‌లో ర్యాంక్ రాలేదని మనస్థాపం చెంది ఇంటి సమీపంలోని వ్యవసాయబావిలో పడి మృతి చెందినట్టు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపారు. హన్మకొండలో ఇంటర్ పూర్తి చేసిన సంకీర్తన ఎంసెట్, నీట్‌లలో ర్యాంక్ రాకపోవడంతో మానసికంగా కలత చెంది, తల్లిదండ్రులతో ప్రతిసారి చెప్పుకుంటూ బాదపడుతూ ఉండేదని వివరించారు. బుధవారం రాత్రి ఇంట్లో సంకీర్తన చదువు విషయంలో చర్చించి మామూలుగానే పడకుందని, […]

వీణవంక: వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామ శివారులోని నర్సింహులపల్లి గ్రామానికి చెందిన బొబ్బల సంకీర్తన(17) అనే విద్యార్థిని నీట్‌లో ర్యాంక్ రాలేదని మనస్థాపం చెంది ఇంటి సమీపంలోని వ్యవసాయబావిలో పడి మృతి చెందినట్టు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపారు. హన్మకొండలో ఇంటర్ పూర్తి చేసిన సంకీర్తన ఎంసెట్, నీట్‌లలో ర్యాంక్ రాకపోవడంతో మానసికంగా కలత చెంది, తల్లిదండ్రులతో ప్రతిసారి చెప్పుకుంటూ బాదపడుతూ ఉండేదని వివరించారు. బుధవారం రాత్రి ఇంట్లో సంకీర్తన చదువు విషయంలో చర్చించి మామూలుగానే పడకుందని, తెల్లవారేసరికి ఇంట్లో లేదని, కూతురు కొరకు వెతకగా సమీపంలోని బావి వద్ద చెప్పులు, చున్నీ ఉండటం చూసిన తండ్రి తన కూతురువేనని గుర్తుపట్టడంతో, గ్రామస్తులు బావిలో సంకెళ్ళతో గాలించగా సంకీర్తన మృతదేహం కనిపించడంతో వారి తల్లిదండ్రులు, గ్రామస్తుల రోధనలతో ఆ ప్రాంతం అంతా శోకసంద్రంలా మారింది. సంకీర్తన తండ్రి కొమాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.

Comments

comments

Related Stories: