నీటి తొట్టిలో పడి బాలుడు మృతి..!

Boy died after falling in water bucket in Mahabubabad District

మహబూబాబాద్: నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం కొత్తూరు(జి) శివారు ప్రాంతం తాట్యతండాలో శనివారం చోటు చేసుకుంది. మాలోతు యశ్వంత్ అనే ఏడాదిన్నర వయసు గల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న నీటి తొట్టిలో పడ్డాడు. ఇంట్లోవాళ్లు అది గమనించకపోవడంతో బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.