నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

two-children-died-in

భద్రాద్రి కొత్తగూడెం: నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం జింకలగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. జింకలగూడెంలోని సీతారామా ప్రాజెక్టు కాలువ పనులు జరుగుతున్న ప్రదేశంలో ఉన్న నీటిగుంతలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు పడ్డారు. చిన్నారులను గమనించిన స్థానికులు వారిని పైకి తీసి చూసే సరికి చిన్నారులు మృతిచెందారు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాధచాయలు అలుముకున్నాయి.