నిహారికా నాగబాబు ‘నాన్న కూచి’

వెండితెరపై హీరోగా.. బుల్లితెరపై జడ్జిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన మెగా బ్రదర్ నాగబాబు ఇక డిజిటల్ తెరపై కూడా కనిపించనున్నారు. ఇప్పటికే ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన కుమార్తె నిహారికాతో కలిసి ఆయన   ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ‘ముద్దపప్పు ఆవకాయ్’ వంటి సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ లు నిర్మించిన పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్  బ్యానర్ పై ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ […]

వెండితెరపై హీరోగా.. బుల్లితెరపై జడ్జిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన మెగా బ్రదర్ నాగబాబు ఇక డిజిటల్ తెరపై కూడా కనిపించనున్నారు. ఇప్పటికే ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన కుమార్తె నిహారికాతో కలిసి ఆయన   ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ‘ముద్దపప్పు ఆవకాయ్’ వంటి సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ లు నిర్మించిన పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్  బ్యానర్ పై ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ ని రూపొందుతోంది. కాగా వినాయక చవతి సందర్భంగా ఈ సిరీస్ కి సంబంధించిన ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ‘అమ్మకూచి బొజ్జ గణపయ్యకి.. నాన్న కూచి టీం దండాలయ్య’ అంటూ ఈ పోస్టర్ ని నిహారిక షేర్ చేశారు. కాగా ఈ సిరీస్ ని నిహారికా స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.