నివేదనకు నిరాజనాలు

‘ప్రగతి నివేదన’ బుక్‌లెట్ కొంగరకలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభలో నాలుగున్నరేళ్ళలో ప్రభుత్వం అమలుచేసిన పథకాల గురించి ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పేర్కొనే అంశాలను టిఆర్‌ఎస్ ప్రచార విభాగం బుక్‌లెట్ రూపంలో ప్రజలకు సభా వేదిక దగ్గర పంచిపెట్టింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ వందశాతం అమలుచేశామని వివరించే ఒక కరపత్రం కూడా సభా ప్రాంగణంలో ప్రజలకు చేరింది. మ్యానిఫెస్టోలో ప్రకటించని 76 కొత్త పథకాలను కూడా ప్రస్తుతం ప్రభుత్వం అమలుచేస్తోందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతటి […]

‘ప్రగతి నివేదన’ బుక్‌లెట్

కొంగరకలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభలో నాలుగున్నరేళ్ళలో ప్రభుత్వం అమలుచేసిన పథకాల గురించి ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పేర్కొనే అంశాలను టిఆర్‌ఎస్ ప్రచార విభాగం బుక్‌లెట్ రూపంలో ప్రజలకు సభా వేదిక దగ్గర పంచిపెట్టింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ వందశాతం అమలుచేశామని వివరించే ఒక కరపత్రం కూడా సభా ప్రాంగణంలో ప్రజలకు చేరింది. మ్యానిఫెస్టోలో ప్రకటించని 76 కొత్త పథకాలను కూడా ప్రస్తుతం ప్రభుత్వం అమలుచేస్తోందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతటి ప్రగతి, సంక్షేమం లేదని, అన్ని సెక్షన్ల ప్రజలనూ ప్రభుత్వ పథకాలు ఆకట్టుకుంటున్నాయని ఆ బుక్‌లెట్ వివరించింది. మ్యానిఫెస్టోలో ప్రకటించకున్నా అమలు చేస్తున్న పథకాలను అంశాలవారీగా పేర్కొనింది. ప్రజా సంక్షేమం అనే విభాగం కింద పన్నెండు పథకాలను, ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమం కింద మూడు పథకాలను, మైనారిటీ సంక్షేమం కింద ఐదు పథకాలను, బిసి సంక్షేమం కింద పది పథకాలను, మహిళా సంక్షేమం కింద మూడు, వ్యవసాయం కింద పదిహేను, ప్రజా వైద్యం కింద మూడు, శాంతిభద్రతలకింద ఏడు… ఇలా ఒత్తం 76 పథకాలను ఈ బుక్‌లెట్ ప్రస్తావించింది.

హెలికాప్టర్ నుంచి సిఎం అభివాదం

ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం నిర్వహించిన అనంతరం కొంగరకలాన్‌లోని ‘ప్రగతి నివేదన’ సభకు హాజరయ్యే నిమిత్తం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ముఖ్యమంత్రి కెసిఆర్ సభా ప్రాంగణం పైనే గాల్లో ఉండగానే ప్రజలకు అభివాదం చేశారు. సభా ప్రాంగణంపైనే మూడు రౌండ్లు హెలికాప్టర్‌లో తిరిగిన కెసిఆర్ మొత్తం ఏర్పాట్లను, ప్రజా సందోహాన్ని పరిశీలించారు. ఔటర్ రింగురోడ్డు మీద బారులుతీరి నిల్చున్న వాహనాలను, పలుచోట్ల ట్రాఫిక్ రద్దీ కారణంగా సభా ప్రాంగణానికి చేరుకోలేక రోడ్లమీదనే ఉండిపోయిన వాహనాలను, రోడ్ల వెంట నడకమార్గంలో వస్తున్న ప్రజలను పరిశీలించారు. సభా ప్రాంగణం దగ్గర తక్కువ ఎత్తులోనే ఎగురుతున్నహెలికాప్టర్‌ను చూడగానే ప్రజలంతా అభివాదం చేయడంతో కెసిఆర్ కూడా సైగలతోనే ప్రజలను పలకరించారు.

సిఎం కెసిఆర్‌తో హెలికాప్టర్‌లో సంతోష్ 

బేగంపేట నుంచి ప్రగతి నివేదన కార్యక్రమానికి బయలుదేరిన హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, సంతోష్, పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు. బేగంపేట నుంచి బయలుదేరిన తర్వాత సభా ప్రాంగణం ప్రాంతానికి వెళ్ళే సమయంలోనే ఔటర్ రింగురోడ్డుపై భారీ స్థాయిలో వాహనాలు రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, రోడ్డు పక్కన పార్కింగ్ చేసిఉండడం తదితరాలను గమనించి ఐజితో మాట్లాడారు.

హద్దులు దాటిన అభిమానం

ఒకవైపు కెసిఆర్& మరోవైపు కెటిఆర్ ప్రత్యేక ఆకర్షణగా పార్టీ అభిమాని టిఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ప్రగతి నివేదన’ సభకు ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు ఉన్నట్లే ఒక అభిమాని అక్కడి ప్రజలను మరింత ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. సభకు వచ్చిన పలువురు టిఆర్‌ఎస్ కార్యకర్తలు పార్టీ నేత సిఎం కెసిఆర్‌పైనా, యువనేత కెటిఆర్‌పైనా అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఓ కార్యకర్త ఏకంగా కెసిఆర్, కెటిఆర్‌పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తలకు ఒక వైపు కెసిఆర్, మరో వైపు కెటిఆర్ అని కనిపించేలా సెలూన్‌కు వెళ్ళి కటింగ్ చేయించుకున్నాడు. ఈ కార్యకర్త తల ప్రగతి నివేదన సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

డోలు వాయించిన  కెటిఆర్

టిఆర్‌ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రగతి నివేదన’ సభను మంత్రి కెటిఆర్ గత నాలుగైదు రోజులుగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అన్నీ తానై కార్యకర్తలకు సూచనలు ఇస్తున్నారు. మంత్రివర్గ సమావేశానికి సైతం హాజరుకాలేకపోయినంత బిజీగా సభా వేదిక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎంతో ఉత్సాహంగా హుషారుగా కనిపించిన కెటిఆర్ ఆదివారం ఉదయం సభా వేదిక దగ్గర కళాకారులతో కలిసి డోలు వాయించారు. కెటిఆర్‌కు ఇదే తొలి అనుభవం కావడంతో డోలును ఎలా వాయించాలో రసమయి బాలకిషన్ సూచనలు చేశారు. దానికి అనుగుణంగా కెటిఆర్ డోలును కొడుతూ రెట్టించిన ఉత్సాహంతో స్టెప్పులేశారు. దీంతో అక్కడే ఉన్న మిగిలిన కార్యకర్తలు కెటిఆర్‌ను భుజాలపైకి ఎత్తుకొని అభినందించారు. మధ్యాహ్నం కొద్దిసేపు చిరుజల్లులు కురిసిన అనంతరం వేదిక మీది నుంచి కింది దిగి గ్యాలరీల దగ్గర ఉన్న మహిళా కార్యకర్తలను పలుకరించారు.

ప్రగతి నివేదన చరిత్రాత్మకం

ప్రగతి నివేదన సభను రాష్ట్ర ప్రజలకు గుర్తుండిపో యే విధంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నా మని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. కొంగరకలాన్ సభా ప్రాంగణం దగ్గర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సంద ర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఇప్పటివరకు ఇంత భారీ స్థాయిలో ఏ రాజకీయ సభా జరగలేదని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా శ్రేణులను సమాయత్తపర్చేందు కు ఈ సభ ఉపయో గప డుతుందన్నా రు. ప్రగతి భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన మం త్రివర్గ సమావేశానికి తనతో పాటు మంత్రి మహేందర్‌రెడ్డి హాజరు కాలేదని స్పష్టంచేశారు. భారీ బహిరంగసభలను నిర్వహించడం టిఆర్‌ఎస్ పార్టీకి ఎప్పటినుంచో అలవాటేనని అన్నారు.

Comments

comments

Related Stories: