నిర్వహణ భారం భరించలేం…

మన తెలంగాణ/సిటీబ్యూరో ః బయోడీజిల్‌పై ఆర్టిసితో పేచీకి దిగేందుకు అద్దె బస్సులు యజమానులు సిద్దం అవుతున్నారు. గత కొంత కాలంగా తమ బస్సుల్లో బయోడీజిల్ వాడరాదని ఆర్టిసికి యాజమాన్యానికి విన్నివిస్తూ వస్తున్నా అద్దె బస్సులు యజమానులు మరో అడుగు ముందుకేసి బస్సులను నడపకూడదనే నిర్ణయానికి వచ్చారు.దీంతో ఆర్టిసి పై మరింత భారం పడే అవకాశం ఉంది. ఆర్టిసి ప్రస్తుతం ప్రస్తుతం 3572 బస్సులతో 29 డిపోల ద్వారా 42,275 ట్రిప్పులతో 10.9 లక్షలల కిలో మీటర్లు తిరుగుతూ […]

మన తెలంగాణ/సిటీబ్యూరో ః బయోడీజిల్‌పై ఆర్టిసితో పేచీకి దిగేందుకు అద్దె బస్సులు యజమానులు సిద్దం అవుతున్నారు. గత కొంత కాలంగా తమ బస్సుల్లో బయోడీజిల్ వాడరాదని ఆర్టిసికి యాజమాన్యానికి విన్నివిస్తూ వస్తున్నా అద్దె బస్సులు యజమానులు మరో అడుగు ముందుకేసి బస్సులను నడపకూడదనే నిర్ణయానికి వచ్చారు.దీంతో ఆర్టిసి పై మరింత భారం పడే అవకాశం ఉంది. ఆర్టిసి ప్రస్తుతం ప్రస్తుతం 3572 బస్సులతో 29 డిపోల ద్వారా 42,275 ట్రిప్పులతో 10.9 లక్షలల కిలో మీటర్లు తిరుగుతూ 33 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించాలనే లక్షంతో నూతన బస్సులను కొనుగోలు చేయాలని భావించింది అయితే. కొత్త బస్సుల కొనుగోలు చేస్తే అసలే కష్టాల్లో ఉన్న ఆర్టిసికి మరింత ఆర్థిక భారం అవుతుందని భావించిన ఆర్టిసి అద్దె ప్రాతిపదికను సుమారు 2200 బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోగా వాటిలోనే గ్రేటర్‌హైదరాబాద్ జోన్ పరిధిలో 500 బస్సులను అద్దె ప్రాతిపదిక మీద రాజేంద్రనగర్, బండ్లగూడ, కంటోన్మెంట్, హయత్‌నగర్ 1, చెంగిచర్ల,హెచ్‌సియు, రాణిగంజ్, 1,2, కంటోన్మెంట్ తదితర డిపోల్లో నడుపుతోంది.

అయితే గత మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఆర్టీసి అండ్ అద్దె బస్సు యజమానులతో జరిగిన ఒప్పందం ప్రకారం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలనీ లేని పక్షంలో ఆగస్టు 1నుండి బస్సులను ఆపుతున్నామని తెలంగాణ ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ వేల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు హెచ్చరిస్తున్నారు.30.9.2015 ప్రకారం ఆర్టీసీ అండ్ అద్దె బస్సు యజమానులకు జరిగిన ఒప్పందం ప్రకారం కేవలం అద్దె బస్సులకు హెచ్‌ఎస్‌డి ఆయిల్ మాత్రమే పోయాలని, బ్లెండెడ్ డీజిల్ పోయడం వల్ల హెచ్‌ఎస్‌డి అయిల్ చిక్కబడి బస్సులు రోడ్ల మీద బ్రేక్ డౌన్ కావడంతో వాటి నిర్వహణ భారం భరించడం కష్టం ఉందంటున్నారు. రోడ్దు మీద బస్సులు బ్రేక్ డౌన్ అయితే మాతో పాటు సంస్థపై ఆర్దిక భారం పడుతుందంటున్నారు.ఆర్టీసీ అద్దె బస్సులకు బయో డిజిల్ కలిపే అంశంపై ఇ.డి స్థాయి అధికారులతో రాష్ట్ర కమిటి, గ్రేటర్ హైద్రాబాద్ జోన్, రంగారెడ్డి రీజియన్ వారు జరిపిన చర్చల్లో తమకు 20శాతం బయో డిజిల్ కలిపితే వచ్చే నష్టాలను గురించి అధికారులకు వివరించినట్లు చెబుతున్నారు.

హెచ్‌ఎస్‌డి ఆయిల్ చిక్కబడి బస్సులు యజమానులు నష్టపోకుండా కేవలం హెచ్‌ఎస్‌డి ఆయిల్‌ను మాత్రమే పోయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.బయోడీజిల్ వినియోగంతో ఆయిల్ ఫిల్టర్లను మాటి మాటికి మార్చాల్సి వస్తోందని ఈ విధం చేయడంతో తమపై సుమారు రూ.60 వేల నుంచి 70 వేల వరకు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై హెడ్ ఆఫీసులో అధికారులతో జరిగిన చర్చల్లో మీరు కచ్చితంగా బ్లెండెడ్ డీజిల్ టాపప్ చేయించుకోవల్సిందే అని మొండిగా వ్యవరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక నైనా అదికారులు ఈ అంశంపై స్పందించి నిర్ణయం తీసుకోక పోతే బస్సులను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు.
సిటిలో తిరిగే బస్సులకు మినహాయింపు ఇస్తున్నాం : ఆర్టిసి అధికారులు
అద్దె బస్సుల అసోసియేషన్ లీడర్లు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకు వచ్చారని ప్రస్తుతం సిటీ తిరిగే బస్సుల వరకు హెచ్‌ఎసిడి అయిల్ వినియోగించేందు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Comments

comments

Related Stories: