నిర్మాతగా కొత్త అవతారం

Prabhu Devaస్టార్ కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత డైరెక్టర్‌గా రాణించాడు ప్రభుదేవా. హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో పలు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా చేసి మంచి క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ప్రొడక్షన్‌లోకి కూడా దిగాడు. ప్రభుదేవా స్టూడియోస్ పేరిట ప్రొడక్షన్ హౌస్‌ను నెలకొల్పాడు. కొత్తగా ప్రారంభించిన ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తానని ప్రభుదేవా తెలిపాడు. తమ బ్యానర్‌లో కాంటెంట్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా చేస్తామన్నాడు. త్వరలో అందరూ కొత్త నటీనటులతో ఓ సినిమాను ప్రారంభించనున్నట్టు ప్రభుదేవా వివరించాడు.

Comments

comments