నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

Two People Dies In Road Accident In Nirmal District

నిర్మల్: జిల్లాలోని కొండాపూర్ బైపాస్ రోడ్ నేషనల్ హైవే 44 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన ఇన్నోవా కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు డెవిస్, కుసుమగా పోలీసులు గుర్తించారు.