నిర్మల్‌లో జాబ్‌మేళా

నిర్మల్ : ఈనెల 17న నిర్మల్‌లో నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఎస్‌పి శశిధర్ రాజు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ జాబ్‌మేళా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. షార్ప్ డిటెక్టివ్ , సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థల్లో ఉద్యోగం చేసేందుకు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. టెన్త్ పాస్ ,ఫెయిల్‌తో సంబంధం లేకుండా […]

నిర్మల్ : ఈనెల 17న నిర్మల్‌లో నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఎస్‌పి శశిధర్ రాజు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ జాబ్‌మేళా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. షార్ప్ డిటెక్టివ్ , సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థల్లో ఉద్యోగం చేసేందుకు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. టెన్త్ పాస్ ,ఫెయిల్‌తో సంబంధం లేకుండా 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చని ఆయన చెప్పారు. ఉత్తీర్ణత సర్టిఫికెట్లు, బయోడేటా, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డుతో పాటు నాలుగు ఫొటోలను తమ వెంట తెచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగం వచ్చిన వారు రోజుకు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. నెల జీతం రూ.14 వేలకు పైనే ఉంటుందని ఆయన వెల్లడించారు.

Job Mela to be held in Nirmal on August 17th

Comments

comments

Related Stories: