నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరు

మన తెలంగాణ/సంగారెడ్డి టౌన్ : టిఆర్‌ఎస్ పాలనలో విద్యారంగం నిర్వీర్యమైందని, కేజి టు పీజి ఉచిత విద్యను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో నిర్మాణ వర్క్‌షాప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ భవనాల్లో చదివే విద్యార్థులకు పక్కా భవనం లేక నానా ఇబ్బందుల మధ్య సావాసం చేస్తున్నారని, సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు సంక్షేమం కరువైందని మండిపడ్డారు. రాష్ట్ర […]

మన తెలంగాణ/సంగారెడ్డి టౌన్ : టిఆర్‌ఎస్ పాలనలో విద్యారంగం నిర్వీర్యమైందని, కేజి టు పీజి ఉచిత విద్యను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో నిర్మాణ వర్క్‌షాప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ భవనాల్లో చదివే విద్యార్థులకు పక్కా భవనం లేక నానా ఇబ్బందుల మధ్య సావాసం చేస్తున్నారని, సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు సంక్షేమం కరువైందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 4వేల ఫీజు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్షం వహిస్తుందన్నారు. విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, ఉద్యమాలు నిర్వహిస్తే రాష్ట్రంలో ఎస్‌ఎఫ్‌ఐ సంఘ నాయకుల మీద నిర్బంధాలు పెట్టడం సిగ్గుచేటన్నారు. నిర్బంధాలతో ఉద్యమాలు అణచలేరన్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్, ఎస్‌ఎమ్‌హెచ్ హాస్టల్స్, స్కూల్, కాలేజి విద్యార్థుల సమస్యలను అధ్యయనం చేయడం కోసం ఈనెల 25 నుంచి సంక్షేమ, అధ్యయన యాత్రలు చేస్తామన్నారు. వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, బాబురావు, ఉపాధ్యక్షులు ప్రవీణ్, శ్రీకాంత్ నాయకులు ఈశ్వర్, సందీప్, సుదర్శన్, యూసూఫ్, మోహన్, శిరీష, మంజుల, ప్రవళిక పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: