నిర్ణీత గడువులోగా ఇంటింటికీ నీరందించాలి

The work of the house tab collection should be completed

ఇంటింటికీ నల్లా కలెక్షన్ అందించే పనిని త్వరతగతిన పూర్తిచేయాలి
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి : జూపల్లి కృష్ణారావు

మనతెలంగాణ/నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ పథకం పథకాన్ని నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ, చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ సంస్థలు , పాఠశాలలు, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.. సరఫరా సమయంలో సమస్యలు రాకుండా ముందుగానే గ్రహించి పైపులైన్లు దెబ్బతినకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రభువ్వ నిర్ణయించిన మేరకు నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. జులై మాసం కల్లా అంతర్గత పైపులైన్లు, ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఒకే సమయంలో పూర్తి చేయడం ద్వారా సకాలంలో నీటిని సరఫరా చేయడానికి వీలవుతుందన్నారు. 743 ఆవాసాలకు గానూ 250 ఆవాసాలకు ప్రస్తుతం నీటిని సరఫరా చేస్తున్నందున పూర్తి స్థాయిలో సరఫరా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 166 కుటుంబాలకు గానూ 158లక్షల కుటుంబాలకు అవసరమైన మెటీరియల్ పంపిణీ జరిగిందన్నారు. మిగతా 8వేల కుటుంబాలకు నీటి సరఫరాకు అవసరమైన మెటీరియల్‌ను వెంటనే తెప్పించాలని ఆదేశించారు. చెక్కులు, పాసుపుస్తకాలకు సంబంధించి ఇంటింటికి వెళ్లి వారి వివరాలను సేకరించి పంపిణీ చేయుటకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సవరణలు, మార్పులకు సంబంధించిన వివరాలను మూడు రోజులలో పూర్తి చేయాలని వలసల వెళ్లిన వారిని, విదేశాలలో ఉన్న వారిని రప్పించి చెక్కుల పంపిణీ వేగవంతం చేయాలని కోరారు. పాసుపుస్తకాలు రాకున్నా ఆధార్ నెంబర్ ఉంటే చెక్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ బండారు భాస్కర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జేసీ సురేందర్‌కరణ్, జిల్లా వ్యవసాయాధికారి సింగారెడ్డి, డీఎఫ్‌ఓ జోజి, మిషన్ భగీరథ, రెవెన్యూ, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Comments

comments