నిరూపిస్తే రాజీనామాకు రెడీ : వివేక్

HCA President G Vivek's Disqualification by High Court

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అవినీతి ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని హెచ్‌సిఎ అధ్యక్షుడు వివేక్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై టిసిఎ చేసిన ఆరోపణల్లో నిజం లేదని, హెచ్‌సిఎపై టిసిఎ నిరాధారమైన విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. రెండు విషయాల్లో అనర్హుడనని అంబుడ్స్‌మెన్ సభ్యుడు చెప్పారని,  సింగిల్ బెంచ్ తీర్పును గౌరవిస్తున్నానని స్పష్టం చేశారు. హెచ్‌సిఎతో విశాఖపట్నంకు ఎలాంటి అగ్రిమెంట్ లేదని, హెచ్‌సిఎలో నిధుల కొరత బాగా ఉందని పేర్కొన్నారు. దీనిపై మరో 10 రోజుల్లో మరోసారి హైకోర్టులో విచారణ జరుగుతుందన్నారు.

Comments

comments