నిరుద్యోగ యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి

Unemployed youth should take advantage of opportunities

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

మన తెలంగాణ/కొల్లాపూర్ : నిరుద్యోగ యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోని అందుకునేంత వరకు ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని ఎస్ ఎం గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ పేదరిక గ్రామీణా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మోగా జాబ్ మేళ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ గతంలో ఉద్యోగ మేళలో 4వేల మంది పాల్గొన్ని 1200 మంది సెలక్షన్ అయితే అందులో కేవలం 120మంది మాత్రమే వివిధ కంపెనీలలో ఉద్యోగాలలో చేరారని ఆయన తెలిపారు. గడిచిన 10సంవత్సరాలలో చాలా మంది నిరుద్యోగులు రత్నగిరి ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్ నేర్చుకోని ఐటి కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం 55 కంపెనీలు ఇక్కడికి వచ్చాయని ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపమోగించుకోని పలు కంపెనీలలో ఉద్యోగాలు చేయాలని కోరా రు. టెంపర్‌వరీ పోస్టుల కోసం ఇక్కడి స్థానిక నాయకులు తమ వెంట పడుతుంటారని తనపై తీవ్రవత్తిడి తెస్తుంటారని ఇలాంటి అవకాశాలు వచ్చినప్పు డు ఉపయోగించుకుంటే సరిపోతుందన్నారు. ప్రస్తుతం నేను పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో ఇన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చాయని ఆయన గుర్తు చేశారు. పిల్లలు తల్లితండ్రులకు భారం కాకుడదన్నారు. నిరాశకు గురికాకుండా నిజాయతీగా ఉండాలన్నారు. తాను 150రూ॥లకు ఉద్యోగం చేశానని ఆయన వెల్లడించారు. ఉద్యోగం చిన్నదైన చేసుకుంటు ఉన్నత ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. అంతకు ముందు ప్రముఖ సైకాలజీస్ట్ లక్ష్మణ్ నిరుద్యోగులకు సైకాలజీపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చిన్న నిరంజన్‌రావు,పెద్దకొత్తపల్లి ఎంపిపి వెంకటేశ్వర్‌రావు, జడ్‌పిటిసిలు హన్మంత్‌నాయక్, సింగారం వెంకటయ్య, దస్తురాంనాయక్, ఇజిఎంఎం డైరెక్టర్ మధుకర్, నాగర్‌కర్నూల్ డిఆర్‌డివో సుధాకర్, వనపర్తి డిఆర్‌డివో గణేష్, ఎపిఎం గౌస్‌ద్దీన్, మొల్గర శ్రీనువాసులు, మాజీ ఎంపిపి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపిటిసి పాండు, టిఆర్‌ఎస్ నాయకులు నరసింహ్మరావు, బోరెల్లి మహేష్, సంపంగి నరసింహ్మ, మేకాల రాముడు, ఎక్బాల్ , రహీంపాషలు పాల్గొన్నారు.

Comments

comments