నియోజకవర్గ అభివృద్ధికి కృషి

వనపర్తి నియోజకవర్గానికి రూ.72.70లక్షలు నిధులు మంజూరు : ఎంఎల్‌ఎ  డా.జి.చిన్నారెడ్డి  మన తెలంగాణ/వనపర్తి : వనపర్తి పట్టణ కేంద్రంలోని ఎంఎల్‌ఎ డా.జి.చిన్నారెడ్డి నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 72 లక్షల 70 వేలు నిధులు మంజూరయ్యా యన్నారు. ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలోని శివాలయం దగ్గర సిసి  రోడ్డు నిర్మాణానికి రూ. 5 లక్షలు, అంతాయపల్లి  గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి […]

వనపర్తి నియోజకవర్గానికి రూ.72.70లక్షలు నిధులు మంజూరు : ఎంఎల్‌ఎ  డా.జి.చిన్నారెడ్డి 

మన తెలంగాణ/వనపర్తి : వనపర్తి పట్టణ కేంద్రంలోని ఎంఎల్‌ఎ డా.జి.చిన్నారెడ్డి నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 72 లక్షల 70 వేలు నిధులు మంజూరయ్యా యన్నారు. ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలోని శివాలయం దగ్గర సిసి  రోడ్డు నిర్మాణానికి రూ. 5 లక్షలు, అంతాయపల్లి  గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి రూ. లక్ష 50వేలు , రుక్కన్నపల్లి గ్రామంలో కమ్యూనిటి హాల్ నిర్మాణానికి రూ. 5 లక్షలు, పెద్దమందడి మండలపరిధిలోని దొడగుంటపల్లి గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటి హాల్ నిర్మాణానికి రూ.5లక్షలు, జంగమాయపల్లి గ్రామంలో కమ్యూనిటి హాల్‌కు రూ. 5 లక్షలు, శ్రీరంగాపురం మండల పరిధిలోని తాటిపాముల గ్రామంలో కమ్యూనిటి హాల్ నిర్మాణానికి రూ.70 వేలు, డ్రైనేజి నిర్మాణానికి రూ. లక్ష 50వేలు,సిసిరోడ్డుకు రూ.లక్ష, తాటిపాముల నుండి కుంతి వాని తాండ వరకు సిసిరోడ్డు పనుల నిర్మాణానికి రూ. క్ష 70 వేలు, తాటిపాముల నుండి శ్రీరంగాపురం వరకు రూ. 80వేలు, కంబలాపురం గ్రామంలో వాల్మీకి కమ్యూనిటి భవనానికి రూ.5లక్షలు, గోపాల్‌పేట మండల పరిధిలోని బుద్దారం వాల్మీకి కమ్యూనిటి భవనానికి రూ.3 లక్షలు, వాల్మీకి మంటపం నిర్మాణా నికి రూ. 3 లక్షలు, వనపర్తి మండల పరిధిలోని అప్పాయపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాల యం నుండి స్కూల్ తాండ వరకు సిసి రోడ్డు నిర్మాణపనులకు రూ. 3 లక్షలు , గ్రామ శివారులో సిసి రోడ్డు నిర్మాణానికి రూ. 3 లక్షలు, పెబ్బేరు మండల పరిధిలోని తోమాలపల్లి గ్రామంలో కమ్యూనిటి హాల్ కు రూ. 80 వేలు, ఘణపురం మండల పరిధిలోని సోలీపూర్ గ్రామంలో వాల్మీకి కమ్యూనిటి హాల్‌కు రూ.4 లక్షల 50 వేలు, పెబ్బేరుకు రూ. 5 లక్షలు, బున్యాదిపురం గ్రామంలో కమ్యూనిటి భవననిర్మాణానికి రూ. 2 లక్షలు, గుమ్మడం నుండి యాపర్ల వరకు రోడ్డు మరమ్మత్తు పనులకు రూ. 3 లక్షల 10వేలు, ఘణపురం మండల పరిధిలోని ఆగారం దర్గా వద్ద రూ . 3 లక్షలు, తిరుమలాయ పల్లి గ్రామంలో బస్‌షెల్టర్‌కు రూ.4 లక్షలు, వనపర్తి పట్టణ కేంద్రంలోని 19వ వార్డులో సిసి రోడ్డు నిర్మాణానికి రూ.2 లక్షల 10వేలు వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం మంజూరైనట్లు ఎంఎల్‌ఎ తెలిపారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజక వర్గంలో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులు నేటికి కనిపిస్తున్నాయన్నారు. నియోజక వర్గ అభివృద్ది కోసం నిధులు మంజూరు పై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో డిసిసి అధ్యక్షులు శంకర్‌ప్రసాద్, మండలాధ్యక్షులు తిరుపతయ్య, పట్టణాధ్యక్షులు కిరణ్‌కుమార్,మహిళా నాయకురాలు ధనలక్ష్మీ, బ్రహ్మం, రాధాకృష్ణ, మైనార్టీ నాయకులు ఖమ్మర్‌మియ్యా, ఎండి.బాబా, అబ్దుల్లా ఉన్నారు.

Comments

comments

Related Stories: