నిబంధనల మేరకు సమస్యలు పరిష్కరించాలి

సమీక్ష సమవేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మన తెలంగాణ/గద్వాల: ప్రభుత్వ నిబంధలు మేరకే గద్వాలలో మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు ఆదేశించారు. బుధవారం ఉదయం మున్సిపాలిటీలోని ఉన్న సమస్యలను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ రోనాల్డ్ రోస్, జిల్లా పరిషత్ చైర్మన్ బండరీ భాస్కర్ తో కలిసి గద్వాలలో మున్సిపాలిటీలో ఉన్న సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఐడిఎస్‌యంటీ పథకం కింద పట్టణంలో కేటాయించిన 485 ప్లాట్‌లను […]

సమీక్ష సమవేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు

మన తెలంగాణ/గద్వాల: ప్రభుత్వ నిబంధలు మేరకే గద్వాలలో మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు ఆదేశించారు. బుధవారం ఉదయం మున్సిపాలిటీలోని ఉన్న సమస్యలను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ రోనాల్డ్ రోస్, జిల్లా పరిషత్ చైర్మన్ బండరీ భాస్కర్ తో కలిసి గద్వాలలో మున్సిపాలిటీలో ఉన్న సమస్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఐడిఎస్‌యంటీ పథకం కింద పట్టణంలో కేటాయించిన 485 ప్లాట్‌లను ఎంత మందికి రిజిస్ట్రేషన్ చేశారని, ఇంకా ఎంత మందికి మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ అడిగారు. అందుకు సమాధానమిచ్చిన మున్సిపల్ కమిషనర్ హెచ్‌ఐజిహెచ్ 6 ప్లాట్ యం ఐ జి హెచ్ కింద 28 ప్లాట్లు ఉన్నాయని వాటిని కోర్డు ఉత్తర్వుల మేరకు 34 మందికి రిజిస్ట్రేష న్ చేయడం జరిగిందని మిగిలిన ఏమైనవో వెల్లడించారు.
అనంతరం పట్టణంలో మున్సిపాలిటీకి సంబంధించిన షాపులపై చర్చ జరిగిందన్నారు. మొత్తం 204 షాపులు ఉన్నాయని, అందులో 47 షాపులకు 30 సంవత్సారాల కన్నా ఎక్కువ గడువు అయినందున వాటికి బహిరంగ వేలము వేయాల్సి ఉందని కమిషనర్ పేర్కొన్నారు. అందుకు జిల్లా కలెక్టర్ స్పందించి షాపులు అన్ని మంచి స్థితిలో ఉంటే అన్నింటికి త్వరలో బహిరంగ వేలం వేయండని, ఒక వేళ ఏమైన బాగు లేని పరిస్థితిలో ఉంటే అలాంటి వాటిని పూర్తిగా రద్దు చేయాల్సిందిగా ఆదేశించారు.
పాత బస్టాండు, మున్సిపాలిటీ పరిసరాలలో 7 షాపుల వేలం వేయకుండా ఇచ్చారని గ్రంథాలయ చైర్మన్ కలెక్టర్ దృష్టికి తీసుకోచ్చారు. వారు ఇప్పటి వరకు అద్దె చెల్లించలేదన్నారు. ఎందుకు అద్దె చెల్లించలేదన్నారు. వెంటనే వారికి నోటీసులను జారీ చేయాలని, గత రెండేళ్ల నుండి అద్దె ఎందుకు చెల్లించ లేదని మొత్తం అద్దె వెంటనే చెల్లించాలని, ఇచ్చిన అద్దె వసూలు చేయాలని మున్సిపల్ కమీషనర్‌ను ఆదేశించారు. కూరగాయల మార్కెట్‌లో ఇంతకు పూర్వం కుళ్ళిపోయిన 94 షాపులు పునర్ నిర్మాణం చేయాల్సి ఉండగా 110 షాపులు నిర్మిచడం జరిగిందన్నారు. అందులో 106 షాపులు అద్దెకు ఇవ్వగా 04 షాపులు మిగిలి ఉన్నాయని బిఎస్ కేశవ్ కలెక్టర్ దృష్టికి తీసుకోచ్చారు. 04 షాపులను బహిరంగ వేలం అద్దేకు ఇవ్వాలని అదేశించారు. అద్దె విధంగా పట్టణ పరిసరాలు మున్సిపాలిటీ లే ఆవుట్ 10 శాతం భూమి ఎక్కడక్క ఉంది . అందులో కభ్జా అయ్యాయ ఒకవేళ అలాంటి వాటిని తోలగించాలని, నివేదికను కలెక్టర్‌ను తన ముందు ఉంచాలని కలెక్టర్ కమీషనర్‌ను అదేశించారు.
పనుల నత్తనడకపై అసహానం..: పట్టణంలోని రైల్వే బ్రిడ్జ్ నత్తనడకనపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఎందుకోసం అలస్యం అవుతుందని ప్రశ్నించగా కంకర , ఇసుక, మట్టి, అందుబాటులో లేదని కాంట్రాక్టర్లు సమాధానం ఇచ్చారు. స్పందించిన అధికారులు మెటిరియల్ మొత్తం మా అధికారులు చేసుకుంటారన్నారు. ఎన్ని రోజులో పూర్తి చేస్తావని ప్రశ్నించగా అక్టోంబర్ 31 వరకు పూర్తి లికిత పూర్వకంగా హామి ఇచ్చారు.

Comments

comments

Related Stories: