ఉపసర్పంచ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
మనతెలంగాణ/ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామ సర్పంచ్ బొల్లం రేణుకను సస్పెన్షన్ చేస్తూ రాజన్న సి రిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ గ్రామ పం చాయతీ నిధులు దుర్వినియోగం చేశారని, వార్డు సభ్యులు కలసి కలెక్టర్‌కు, డిపిఆర్ఓకు గతంలో ఫీర్యాదు చేశారు.దీంతో స్పందిం చిన కలెక్టర్ వెంటనే నిధుల దుర్వినియోగం పై వివరణ ఇవ్వాలని గత ఏడాది క్రితం షో కాజ్ నోటిసులను జారీ చేశారు. కలెక్టర్ పం పిణీ షోకాజ్ నోటిసులకు సర్పంచ్ వివరణ ఇవ్వక పోవడంతో శనివారం సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారని ఎంపిడిఒ సం ధ్యారాణి తెలిపారు. అదేవిధంగా పస్తుతం ఉన్న ఉపసర్పంచ్ చొప్పరి అశోక్‌కు ఇన్చార్జి సర్పంచ్‌గా బాధ్యతలు అప్పగించడం జరిగింద న్నా రు. దీనిపై సర్పంచ్ బొల్లం రేణుకను ‘మనతెలంగాణ’ వివరణ కోరగా ఎలాంటి నిధుల దుర్వినియోగానికి పాల్పడ లేదని, అన్ని పనులకు సంబంధించి ఎంబి రికార్డు నమోదు చే శామని, పూర్తి రికార్డులను కలెక్టర్‌కు అప్పగిస్తామని తెలిపారు.