నిత్యావసర రేషన్ సరుకులకు ఆటంకం కలుగకుండా చర్యలు

వనపర్తి: రేషన్ డీలర్ల సమ్మె దృష్టా పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా నిత్యావసర సరుకులందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్టు చేయాలని జాయింట్ కలెక్టర్ పి.చంద్రయ్య కోరారు. ఈ విషయమై బుధవారం ఆయన పౌర సరఫరాలు, డిఆర్‌డిఒ, రెవెన్యూ, స్టేజ్-2 ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లు, తహశీల్దార్లతో కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో సమీక్షించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీకి ఆటంకం కలుగకుండా ఉండేందుకు రేషన్ డీలర్లు సమ్మె విరమించాలని అలాగే ఈ నెల […]

వనపర్తి: రేషన్ డీలర్ల సమ్మె దృష్టా పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా నిత్యావసర సరుకులందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్టు చేయాలని జాయింట్ కలెక్టర్ పి.చంద్రయ్య కోరారు. ఈ విషయమై బుధవారం ఆయన పౌర సరఫరాలు, డిఆర్‌డిఒ, రెవెన్యూ, స్టేజ్-2 ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లు, తహశీల్దార్లతో కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో సమీక్షించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీకి ఆటంకం కలుగకుండా ఉండేందుకు రేషన్ డీలర్లు సమ్మె విరమించాలని అలాగే ఈ నెల 28 లోగా రేషన్ డీలర్లు రేషన్ సరుకులకు డబ్బులు చెల్లించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారని ఆయన తెలిపారు. ఒకవేళ డీలర్లు సమ్మె పొడిగించినట్లయితే గ్రామాల్లో ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ సంఘాల ద్వారా అలాగే పట్టణాల్లో ఐకెపి సంఘాల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ లక్ష్మయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారిణి రేవతి, డిఆర్‌డిఒ గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Stories: