నిజాయితీ చాటుకున్న క్యాబ్‌వాలా

హైదరాబాద్: భారీ మొత్తంలో నగదుతో ఉన్న బ్యాగును కారులోనే మర్చిపోయిన ప్రయాణికుడికి తిరిగి ఇచ్చేసి క్యాబ్‌ డ్రైవర్‌ నిజాయితీని చాటుకున్నాడు. ఈనెల 16న సాయంత్రం 5.30 గంటలకు అప్పారావు అనే వ్యక్తి బంజరాహిల్స్‌ నుంచి ఉస్మానియా క్యాంపస్‌ వెళ్లేందుకు ఉబర్‌ క్యాబ్‌ను బుక్‌ చేసుకున్నాడు. అయితే అప్పారావు క్యాంపస్‌ చేరుకోగానే తనతో పాటు తెచ్చుకున్న రూ.1, 25,000 నగదు ఉన్న బ్యాగును క్యాబ్‌లోనే మర్చిపోయి దిగిపోయాడు. క్యాబ్‌ డ్రైవర్‌ కంచుకుమార్‌ మంగళవారం తన కారును శుభ్రం చేస్తుండగా అందులో బ్యాగు కనిపించింది. […]

హైదరాబాద్: భారీ మొత్తంలో నగదుతో ఉన్న బ్యాగును కారులోనే మర్చిపోయిన ప్రయాణికుడికి తిరిగి ఇచ్చేసి క్యాబ్‌ డ్రైవర్‌ నిజాయితీని చాటుకున్నాడు. ఈనెల 16న సాయంత్రం 5.30 గంటలకు అప్పారావు అనే వ్యక్తి బంజరాహిల్స్‌ నుంచి ఉస్మానియా క్యాంపస్‌ వెళ్లేందుకు ఉబర్‌ క్యాబ్‌ను బుక్‌ చేసుకున్నాడు. అయితే అప్పారావు క్యాంపస్‌ చేరుకోగానే తనతో పాటు తెచ్చుకున్న రూ.1, 25,000 నగదు ఉన్న బ్యాగును క్యాబ్‌లోనే మర్చిపోయి దిగిపోయాడు. క్యాబ్‌ డ్రైవర్‌ కంచుకుమార్‌ మంగళవారం తన కారును శుభ్రం చేస్తుండగా అందులో బ్యాగు కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో భారీ మొత్తంలో నగదు కనిపించింది. దీంతో వెంటనే అతడు ఆ బ్యాగును పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు అప్పగించాడు. బ్యాగులో దొరికిన ఆధారాలతో సిఐ రవిచంద్ర, ఎస్‌ఐ మహేష్‌లు ప్రయాణికుడు అప్పారావుకు ఫోన్‌ చేసి బ్యాగును అతనికి అప్పగించారు. కాగా, కంచుకుమార్‌ నిజాయితీని ప్రశంసిస్తూ అప్పారావు అతడికి రూ. 5 వేల నగదు అందజేశాడు.

Comments

comments

Related Stories: