నిజామాబాద్‌లో దారుణం..అన్నదమ్ములు మృతి

నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఇరువర్గాల మద్య జరిగిన గొడవలో అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఆదర్శనగర్‌లో గల సాయి అపార్ట్‌మెంట్ కు చెందిన పవన్‌ యాదవ్,నర్సింగ్‌ యాదవ్‌లపై తల్వార్ సాయికి చెందిన నలుగురు వ్యక్తులు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పవన్‌ యాదవ్‌కు మెడపై తీవ్రగాయం కాగా అక్కడికక్కడే మృతి చెందాడు.కాగా అతని సోదరుడు నర్సింగ్ యాదవ్‌పై సైతం కత్తితో దాడి చేయడం తీవ్రగాయాలైన […]


నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఇరువర్గాల మద్య జరిగిన గొడవలో అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఆదర్శనగర్‌లో గల సాయి అపార్ట్‌మెంట్ కు చెందిన పవన్‌ యాదవ్,నర్సింగ్‌ యాదవ్‌లపై తల్వార్ సాయికి చెందిన నలుగురు వ్యక్తులు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పవన్‌ యాదవ్‌కు మెడపై తీవ్రగాయం కాగా అక్కడికక్కడే మృతి చెందాడు.కాగా అతని సోదరుడు నర్సింగ్ యాదవ్‌పై సైతం కత్తితో దాడి చేయడం తీవ్రగాయాలైన అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రికరిస్తున్న మరో వ్యక్తి పై సైతం దుండగులు దాడికి పాల్పడ్డట్లు తెలిసింది. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిసింది.

Related Stories: