నాలుగో పెళ్లికి సిద్ధపడ్డ భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

మన తెలంగాణ/హైదరాబాద్/ఎల్‌బినగర్ : గుట్టు చప్పుడు కాకుండా నాలుగోపెళ్ళికి సిద్ధపడ్డ భర్త ఇంటి ముందు ఓ భార్య తన బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. తమ ఇంటి వద్దకు ఆందోళన చేయడానికి కోడలు వస్తుందన్న సంగతి తెలుసుకున్న సదరు అత్తా, మామలు ఇంటికి తాళం వేసుకొని పలాయనం చిత్తగించారు. ఈ సంఘటన నగరంలోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకొంది. బాధితుల కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. సరూర్‌నగర్‌లోని భాగ్యనగర్ […]

మన తెలంగాణ/హైదరాబాద్/ఎల్‌బినగర్ : గుట్టు చప్పుడు కాకుండా నాలుగోపెళ్ళికి సిద్ధపడ్డ భర్త ఇంటి ముందు ఓ భార్య తన బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. తమ ఇంటి వద్దకు ఆందోళన చేయడానికి కోడలు వస్తుందన్న సంగతి తెలుసుకున్న సదరు అత్తా, మామలు ఇంటికి తాళం వేసుకొని పలాయనం చిత్తగించారు. ఈ సంఘటన నగరంలోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకొంది. బాధితుల కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. సరూర్‌నగర్‌లోని భాగ్యనగర్ కాలనీ నివాసులైన కృష్ణ, భారతిల కుమారుడు శ్రీనివాస్‌కు 2014 మే 23వ తేదీన కామారెడ్డి శ్రీరమణారెడ్డి కాలనీకి చెందిన నారాయణ, నాగరాణి దంపతుల కుమార్తె అయిన అనూషతో వివాహం జరిగింది. శ్రీనివాస్ భువనగిరిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ళ పాటు శ్రీనివాస్, అనూషల సంసారం సాఫీగానే సాగింది.

అయితే అనూషకు సంతానం కలుగక పోవడంతో భర్త శ్రీనివాస్, అతని తల్లి, అక్క, బావలు వేధింపులు మొదలుపెట్టారు. రెండేళ్ళుగా వీరి వేధింపులు తీవ్రతరం కావడంతో అనూష కొద్ది రోజుల కిందట సరూర్‌నగర్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే అనూషకంటే ముందుగా శ్రీనిధి, సోని అనే మహిళలను కూడా శ్రీనివాస్ వివాహం చేసుకున్నట్లు అనూష కుటుంబ సభ్యులకు తెలిసింది. ఇదిలా ఉండగా ఇటీవల శ్రీనివాస్ తనకు విడాకులు కావాలంటు అనూషకు నోటీసులు పంపాడు.

ఒకవైపు ఈ వివాదం కొనసాగుతుండగా ఈ నెల 25న మరో పెళ్ళి చేసుకోవడానికి శ్రీనివాస్ తయారవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అనూష తన బంధువులతో కలిసి ఆదివారం భర్త ఇంటివద్దకు వచ్చింది. కాగా ఈ విషయాన్ని పనిగట్టిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకొని ఉడాయించారు. దీనితో అనూష తనకు న్యాయం జరిపించాలంటూ భర్త ఇంటిముందు నిరసనకు దిగింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.

Comments

comments

Related Stories: