నాలుగేళ్ల అభివృద్ధే.. టిఆర్ఎస్ ను గెలిపిస్తుంది…

Four years development will win TRS

ఐటీ, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కెటిఆర్
ఎల్లారెడ్డిపేటలో సుడిగాలి పర్యటన
పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు

మనతెలంగాణ/ఎల్లారెడ్డిపేట: నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులే వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం లో ఆయన సోమవారం సుడిగాలి పర్యటన చేశా రు. మొదట మండలంలోని పదిర గ్రామంలో గ్రామపంచాయతీ భవనం, పలు కమ్యూనిటీ హాల్లు, మహిళా సంఘ భవనాలను ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం హరిదాస్‌నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గతంలో ప్ర భుత్వంలో ఉన్న పార్టీలు రాష్ట్రంలో కేవలం 29లక్షల మందికి మాత్ర మే ఫించన్‌లు అది 200ల చొప్పున ఇవ్వగా, కెసిఆర్ ప్రభుత్వం 42 లక్షల మందికి రూ.వెయ్యి, పదిహేనువందల చొప్పున ఫించన్‌లు అందించిందన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం ఒంటి మహిళలు, ఫైలేరియా బాధితులకు సైతం నెలకు వెయ్యి రూపాయల చొప్పున పింఛన్ ఇస్తూ నేనున్నాను అంటూ కెసిఆర్ పేదలకు వెన్నుదన్నుగా ఉంటున్నాడన్నా రు.ఇంత జరిగినా ప్రతిపక్షాలకు బుద్ధి రావడం లేదని విమర్శించా రు. ఏదైనా అంటే మేము రెండు పార్టీలు కలిసి గ్రామాల్లో తిరిగి ప్ర భుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగడుతాం అంటున్నారు. మీరిద్దరు కాదు మరో నలుగురైదుగురు కలిసి వచ్చినా కానీ టిఆర్‌ఎస్ ప్రతిష్ట దెబ్బతినదన్నారు. అదేదో సినిమాలో హీరో అన్నట్లు… గుంపులుగా వస్తాయి.. కానీ సింహం సింగిల్‌గా వస్తది..అలాగే కెసిఆర్ సింగిల్‌గా పోటీ చేసి 2019లో ఎదుటి వారికి డిపాజిట్‌లు దక్కకుండా చేస్తాడని స్పష్టం చేశారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా వారికి దిమ్మదిరగడం ఖాయమన్నారు. అలాగే ఇప్పటికే నియోజక వర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా చేసినట్లు తెలిపారు. ప్రతి కులానికి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉం డాలనే ఉద్దేశ్యంతో కులసంఘ భవనాలను నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. అలాగే కులవృత్తులను ప్రోత్సహించే విధంగా అన్ని వర్గాల వారికి అనువైన రీతిలో ఉపాధి కల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయితే సత్పలితాలను రాష్త్ర ప్రజలు అనుభవిస్తారన్నారు. వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చింది కే వలం టిఆర్‌ఎస్ పార్టీ అని అన్నారు.అనంతరం హరిదాస్‌నగర్‌లో గ్రామపంచాయతీ భవనంతో పాటు పలు కులసంఘాలు,మహిళా సంఘాల భవనాలను ప్రారంభించి, మొక్కలను నాటారు.
అటునుంచి ఎల్లారెడ్డిపేట మీదుగా గొల్లపల్లికి వెళ్లి పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.అనంతరం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మున్నూరుకాపు, రజక సంఘం, నాయూబ్రాహ్మణ సంఘ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిదులు ఉన్నారు.కాగా మంత్రి పర్యటన దృష్టా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌పి రా హుల్ హెగె ్డ సిబ్బందికి పలు సూచనలు చేశారు.