నారీశక్తిని గుర్తించిన ఆక్స్‌ఫర్డ్

  2018 సంవత్సరంలో మహిళలు సాధించిన సాధికారత అంతా ఇంతా కాదు. తమకు ఎదురైన అనేక ఆటుపోట్లను ఎదుర్కొని చట్టపరంగా విజయాలు సాధించారు. ఈ క్రమంలో నారీశక్తి అనే పదం పదేపదే తెరపైకి వచ్చింది. 2018లో ఎన్నో విజయాలను సాధించి దూసుకుపోయిన నారీశక్తి అనే పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేర్చాలనే నిర్ణయాన్ని ఈ మధ్య జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో తీసుకున్నారు. ఇందుకు గాను ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ బృందం, పలువురు భాషా నిపుణుల సాయంతో నారీశక్తిని ఎంపిక చేశారు. […]

 

2018 సంవత్సరంలో మహిళలు సాధించిన సాధికారత అంతా ఇంతా కాదు. తమకు ఎదురైన అనేక ఆటుపోట్లను ఎదుర్కొని చట్టపరంగా విజయాలు సాధించారు. ఈ క్రమంలో నారీశక్తి అనే పదం పదేపదే తెరపైకి వచ్చింది.
2018లో ఎన్నో విజయాలను సాధించి దూసుకుపోయిన నారీశక్తి అనే పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేర్చాలనే నిర్ణయాన్ని ఈ మధ్య జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో తీసుకున్నారు. ఇందుకు గాను ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ బృందం, పలువురు భాషా నిపుణుల సాయంతో నారీశక్తిని ఎంపిక చేశారు.

ఈ నేపథ్యంలో ‘నారీ శక్తి’ పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ చేర్చడం ఆనందించ దగ్గ విషయం. సంస్కృతంలో నారీ అంటే మహిళ, శక్తి అంటే అధికారం. ఈ రోజుల్లో ఈ పదాన్ని మహిళలు తమ సాధికారతకు గుర్తుగా వాడుతున్నారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడుతూ అన్ని రంగాల్లో తమ కంటూ ఓ ముద్రను వేసుకుంటూ దూసుకుపోతున్నారు. మహిళ తన శక్తి ఏంటో లోకానికి చాటుతూనే ఉంది. మరో పదిమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అలాంటి సందర్భంలో వాడే నారీ శక్తిని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేర్చడం పట్ల మహిళలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2018లో నారీశక్తి అనే పదం మహిళల్లో చాలా చైతన్యాన్ని కలిగించింది. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు పనిచేసే చోట తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ఎంతోపోరాడి గెలిచారు కూడా.

అసలింతకీ ఈ పదాన్ని తీసుకోవడానికి కారణాలేంటంటే….
1. పోయిన సంవత్సరం మహిళలను చాలావరకు జాగృతపరిచింది. భారతప్రభుత్వం, హిందీ మాట్లాడే ప్రజలు ఇందుకు కృషి చేశారు.

2. మీటూ ఉద్యమం దేశాన్ని ఎంత ప్రభావితం చేసిందో తెలిసిందే. ఆడవాళ్లను వేధించేవారిని, వేధిస్తున్నవారిని, వాళ్లు ఎంత గొప్పవారైనా సరే బయటపెట్టి తమ సత్తా ఏంటో చూపారు మహిళలు.

దెబ్బకు మహిళల జోలికి వెళ్తే తమ పరువు గంగపాలవుతుందని తెలుసుకున్నారు కొంతమంది మగానుభావులు. పనిచేసే చోట మహిళలకు మరింత గౌరవం పెరిగిందనే చెప్పవచ్చు. దేశ వ్యాప్తంగా మహిళల హక్కులకు, సాధికారతకు వీలు కల్పించే విధంగా ‘మీ టూ ’ ప్రచారం విజయానికి దారితీసింది.

పోయిన ఏడాది మార్చిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు భారతప్రభుత్వం నారీ శక్తి పురస్కారం అనే పేరు మీదుగా అవార్డులను అందజేయడం విశేషం. స్త్రీలంటే ఇలాగే ఉండాలి. వాళ్లు ఈ పనులే చేయాలి అనే సనాతన సంప్రదాయాలకు తిలోదకాలిచ్చారు కొంతమంది మహిళలు. స్టీరియోఫోనిక్ జీవితానికి స్వస్తి పలికారు. అలాంటి మహిళలు ఈ నారీ శక్తి అవార్డులను అందుకున్నారు.

బేటీబచావో – బేటీ పడావో ప్రభుత్వం చేసిన ప్రచారం అత్యంత విజయ వంతమైంది. ఆన్‌లైన్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సైబర్‌క్రైంలు, వేధింపులు ఎక్కువయిన సంగతి తెలిసిందే. ఇలాంటి వేధింపులకు పరిష్కార మార్గం చూపెడుతూ యూనివర్సల్ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేశారు.

Nari Shakti word is included in Oxford Dictionary

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: