నాన్నంటే చాలా ఇష్టం..

Niharika

నిహారిక కొణిదెల ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, టీవీ యాంకర్ నాగేంద్రబాబు కూతురు. నటి కంటే ముందు ఈటీవీలో ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ షోలకు యాంకర్‌గా పనిచేసింది. ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిలింలో హీరోయిన్‌గా నటించింది. 2016లో ఒక మనసు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా నటిగా తెరంగేట్రం చేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే తన సొంత బ్యానర్‌లో ‘నాన్నకూచి’ నిర్మించి నటించింది. ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్ అనే తమిళ సినిమాలో చేసింది. తాజాగా హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్ ప్లస్‌ల్లో ఎప్పుడూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది……

పుట్టినతేదీ : డిసెంబర్ 18, 1993, హైదరాబాద్
నిక్‌నేమ్ : నిహా
ఎడ్యుకేషన్ : సెయింట్ మేరీస్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్
అభిరుచులు : మ్యూజిక్ వినడం, డాన్స్, కుకింగ్, రీడింగ్
తల్లిదండ్రులు : నాగేంద్రబాబు, పద్మజ
బ్రదర్ : వరుణ్‌తేజ్
ఇష్టమైన ఫుడ్ : సౌత్ ఇండియన్ ఫుడ్, బిర్యానీ
ఫేవరెట్ నటీనటులు : చిరంజీవి, రజనీకాంత్, ప్రభాస్, పవన్‌కళ్యాణ్, శ్రీదేవి, శ్రేయసరన్, జయప్రద, సౌందర్య
ఇష్టమైన సినిమాలు : విజేత, ఖైదీ, మగధీర
ఫేవరెట్ డైరెక్టర్ : ఎస్.ఎస్. రాజమౌళి
ఫేవరెట్ టీవీ షోలు : ఢీ జూనియర్స్ 1, 2
ఫేవరెట్ కలర్స్ : పింక్, వైట్, బ్లాక్
ఫేవరెట్ ప్లేస్ : బ్యాంకాక్
కార్ : ఆడి.

Comments

comments