నాదల్ ముందంజ

న్యూయార్క్: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్), అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ ముందంజ వేశారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్, సెరెనా విజయం సాధించారు. మరోవైపు పదకొండో సీడ్ జాస్ ఇస్నర్ (అమెరికా), మూడో సీడ్ డెల్‌పొట్రొ (అర్జెం టీనా) కూడా క్వార్టర్స్ ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే ఐదో సీడ్ కెవిన్ అండర్సన్ (సౌతాఫ్రికా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. తొమ్మిదో సీడ్ డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా) చేతిలో అండర్సన్ […]

న్యూయార్క్: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్), అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ ముందంజ వేశారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్, సెరెనా విజయం సాధించారు. మరోవైపు పదకొండో సీడ్ జాస్ ఇస్నర్ (అమెరికా), మూడో సీడ్ డెల్‌పొట్రొ (అర్జెం టీనా) కూడా క్వార్టర్స్ ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే ఐదో సీడ్ కెవిన్ అండర్సన్ (సౌతాఫ్రికా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. తొమ్మిదో సీడ్ డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా) చేతిలో అండర్సన్ కంగుతిన్నా డు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ స్లొవానె స్టీఫెన్స్ (అమెరికా), అనస్తాజియా సెవస్తొవా (లాత్వియా) ముందంజ వేశారు. మరోవైపు ఏడో సీడ్ ఎలినా స్విట్లొనా (ఉక్రె యిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది.

క్వార్టర్స్‌లో నాదల్…
టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. జార్జియా ఆటగాడు నికొలొజ్‌తో జరిగిన పోరు లో నాదల్ 63, 63, 67, 64 తేడాతో విజయం సాధించాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన నాదల్ ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన నాదల్ అలవోకగా తొలి రెండు సెట్లను కైవసం చేసుకున్నాడు. అయితే మూడో సెట్‌లో మాత్రం నాదల్‌కు ప్రత్యర్థిని నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అనూహ్యంగా పుంజుకున్న నికొలజ్ సెట్ ను గెలుచుకున్నాడు. కానీ, కీలకమైన నాలుగో సెట్‌లో మళ్లీ ఆధిపత్యం చెలాయించిన నాదల్ మ్యాచ్‌ను సొంతం చేసుకుని ముందంజ వేశాడు. మరో పోటీలో పదకొండో సీడ్ ఇస్నర్ చెమటోడ్చి విజయం సాధించా డు. మిలొస్ రౌనిక్ (మాంటెనిగ్రో)తో జరిగిన పోరులో ఇస్నర్ 36, 63, 64, 36, 62 జయకేతనం ఎగుర వేశాడు. తొలి సెట్‌లో రౌనిక్ జోరు కొనసాగిం చాడు. ఇస్నర్‌ను ముప్పుతిప్పలు పెట్టిన రౌనిక్ అలవో కగా సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ, తర్వాతి రెండు సెట్లలో ఇస్నర్ ఆధిపత్యం చెలాయించాడు.

చూడచక్కని ఆటతో చెలరేగిన ఇస్నర్ రెండు సెట్లను గెలుచుకున్నాడు. నాలుగో సెట్‌లో మళ్లీ రౌనిక్ పైచేయి సాధించాడు. దూకుడుగా ఆడుతూ సెట్‌ను దక్కించుకు న్నాడు. అయితే ఫలితాన్ని తేల్చే చివరి సెట్‌లో ఇస్నర్ చెలరేగి పోయాడు. తనకు మాత్రమే సాధ్యమైన షాట్ల తో ప్రత్యర్థిని హడలెత్తిస్తూ మ్యాచ్‌ను సొంతం చేసుకు న్నాడు. మరోవైపు మూడో సీడ్ డెల్‌పొట్రొ ప్రిక్వార్టర్ ఫైనల్లో అలవోకగా విజయం సాధించాడు. క్రొయేషి యా ఆటగాడు బొర్నా కొరిక్‌తో జరిగిన పోరులో డెల్ పొట్రొ 64, 63, 61 విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. మరో పోటీలో ఐదో సీడ్ అండ ర్సన్‌కు చుక్కెదురైంది. తొమ్మిదో సీడ్ డొమినిక్ థిమ్‌తో జరిగిన పోరులో అండర్సన్ ఓటమి చవిచూశాడు. ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించిన థిమ్ 75,62, 76 తేడాతో విజయం సాధించాడు.

ఎదురులేని సెరెనా..
మహిళల సింగిల్స్‌లో 17వ సీడ్ సెరెనా విలియమ్స్ ముందంజ వేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా 60, 46, 63 తేడాతో ఎస్టోనియా క్రీడాకారిణి కయా కనెపిను ఓడించింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న సెరెనాకు రెండో సెట్‌లో చుక్కెదురైంది. అయితే కీలకమైన మూడో సెట్‌లో చెలరేగి ఆడిన సెరెనా అలవోకగా విజయాన్ని అందుకుని క్వార్టర్స్‌కు చేరింది. మరో పోటీలో మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ స్లొవానె స్టీఫెన్స్ విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో స్టీఫెన్స్ 63, 63తో ఎలిసె మార్టెన్స్ (బెల్జియం)ను ఓడించింది. మరోవైపు ఏడో సీడ్ స్విట్లొనాకు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి ఎదురైంది. 19వ సీడ్, లాత్వియా క్రీడాకారిణి సెవస్తొవా 63, 16, 60 తేడాతో స్విట్లొనాను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

Comments

comments

Related Stories: