నాగార్జున, కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో…

టాలీవుడ్‌లో నందమూరి, అక్కినేని కాంబినేషన్‌కు ఉన్న క్రేజే వేరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి చేసిన పలు హిట్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆతర్వాత నందమూరి, అక్కినేని కాంబినేషన్ అరుదైపోయింది. చాలా ఏళ్ల కిందట నాగార్జున, హరికృష్ణ కలిసి ‘సీతారామరాజు’ సినిమా చేశారు. ఆతర్వాత ఇటీవల ఎన్టీఆర్, నాగచైతన్య కలిసి ‘గుండమ్మ కథ’లో నటించడం గురించి చర్చలు నడిచాయి. కానీ ఆ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదు. అయితే త్వరలోనే నందమూరి-అక్కినేని కాంబోను మళ్లీ తెరపై చూడబోతున్నట్లుగా ప్రచారం […]

టాలీవుడ్‌లో నందమూరి, అక్కినేని కాంబినేషన్‌కు ఉన్న క్రేజే వేరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి చేసిన పలు హిట్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆతర్వాత నందమూరి, అక్కినేని కాంబినేషన్ అరుదైపోయింది. చాలా ఏళ్ల కిందట నాగార్జున, హరికృష్ణ కలిసి ‘సీతారామరాజు’ సినిమా చేశారు. ఆతర్వాత ఇటీవల ఎన్టీఆర్, నాగచైతన్య కలిసి ‘గుండమ్మ కథ’లో నటించడం గురించి చర్చలు నడిచాయి. కానీ ఆ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదు. అయితే త్వరలోనే నందమూరి-అక్కినేని కాంబోను మళ్లీ తెరపై చూడబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు హరికృష్ణతో తెరను పంచుకున్న నాగార్జున… ఇప్పుడు ఆయన పెద్ద కొడుకు కళ్యాణ్‌రామ్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడట. కళ్యాణ్‌రామ్ త్వరలోనే ‘ప్రేమ ఇష్క్ కాదల్’ దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అది ఒక మల్టీస్టారర్ అని సమాచారం. ఇందులో కీలక పాత్రలో నాగార్జున నటిస్తాడట. ఇప్పటికే నాగార్జునకు కథ వినిపించగా ఆయన ఓకే అన్నట్లు సమాచారం. సోలో హీరోగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నా నాగ్ ఇప్పుడు మల్టీస్టారర్లకు సరేనంటున్నాడు. ఆయన ఇప్పటికే నాని కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదయ్యాక నాగార్జున నటించే చిత్రమిదని సమాచారం. ప్రస్తుతం దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ గుహన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో కళ్యాణ్‌రామ్ నటిస్తున్నాడు. త్వరలోనే అది పూర్తిచేసి నాగార్జునతో అతను సినిమా మొదలుపెట్టనున్నాడు. ఈ చిత్రాన్ని కళ్యాణ్‌రామే స్వయంగా నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయి.

Related Stories: