నాగర్‌కర్నూల్ లో దారుణం…

 A 10-day female babe leaves the forest

నాగర్‌కర్నూల్:   గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మైసమ్మ దేవాలయం ముందు గుర్తు తెలియని వ్యక్తులు 10 రోజుల ఆడ పసికందు ను వదిలి వెళ్లిన సంఘటన జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం చారకొండ మండలంలోని గోకారం గ్రామ శివారులో  చోటు చేసుకుంది. సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకొని వస్తున్న రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పసికందును  పసికందుకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జిల్లా కేంద్రంలోని శిశుగృహానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.