నాగర్‌కర్నూల్‌ను విద్యారంగంలో ముందుకు తీసుకు వెళ్తా

Nagar karnool will be brought forward in education

గత పాలకుల వల్లే విద్యాభివృద్ధిలో ఈప్రాంతం వెనుకబడింది
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రతిభా పరీక్ష ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ ప్రాంతం గత పాలకుల నిర్లక్షం వల్ల విద్యాభివృద్ధి విషయంలో పూర్తిగా వెనుకపడేయ పడిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం స్థానిక జెడ్‌పీ క్రీడా మైదానంలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు నిర్వహిస్తున్న  ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ల పోటీ పరీక్ష ఉచిత శిక్షణ శిబిరంలో మెగా ప్రతిభ పరీక్షను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ ప్రాంతాన్ని విద్యారంగంలో ముం దుకు తీసుకు వెళతానని ఈప్రాంత ప్రజలకు భరోస నిచ్చారు.  తనకు ప్రజలు అవకాశం కల్పించారని, తాను చేస్తున్న అభివృద్ధి, సేవను చూసి నన్ను ఆదరించారే తప్పా, ఎన్నికలలో డబ్బులు పం చితే ఓటేస్తారని తాను భావించనని అట్టడుగు స్థాయినుంచి పేదలు అభివృద్ధి చెందాలన్నదే తన లక్షమన్నారు. ఇందు కోసం తనస్వంత నిధులు సైతం వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. గతంలో తెలకపల్లిలో రెండు నెలల పాటు వెయ్యిమంది నిరుద్యోగులకు మూడు పూటల భోజనం పెట్టి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిదంగా డీఎస్సీ అభ్యర్థులకు పాలెంలో ఉచిత శిక్షణ అందిస్తూ ప్రతి రోజు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందించామన్నారు. ప్రస్తుతం పోలీసు శాఖలో ఉద్యోగాలకు తమ ట్రస్టు ద్వారా సుమారు వెయ్యి మందికి శిక్షణ ఇచ్చేందుకు ఎంజేఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో తాము ముందుకు వచ్చామన్నారు. ఎమ్మెల్యేగా ప్రభుత్వం తనకు ఇచ్చే పారితోషకాన్ని విద్యాభివృద్దికే వినియోగిస్తున్నానని తమ వద్దకు శిక్షణకు వస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వడం జరిగిందన్నారు. గత పాలకుల నిర్లక్షం వల్ల ప్రాజెక్టులు పూర్తి కాక పోవండం వల్ల ఈప్రాంత ప్రజలు పేదరికంలో మగ్గుతూ వచ్చారన్నారు. తద్వారా చదువుకు దూరమయ్యారని ఆయన అన్నారు. శిక్షకుడు, ఎక్సైజ్ సీఐ ఏడు కొండలు మాట్లాడుతూ విద్య పట్ల శ్రద్ద చూపిస్తూ పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వారు అభినందించారు. లక్షలు వెచ్చించి పేద విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా మూడు పూటల బోజనం అందించి పోటీ పరీక్షలకు మెటీరియల్ అందించడం అభినందనీయమని కొనియాడారు. మెగా ప్రతిభ పరీక్ష ప్రశ్నా పత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనువాస్ యాదవ్, ట్రస్ట్ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, ప్రముఖ ఆర్కిటెక్చర్ పరుషురాంరెడ్డి, సీఐ శ్రీనువాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.