నాకు సీటు ఎందుకు ఇవ్వలేదు: సురేఖ

హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన అసెంబ్లీ సీట్ల జాబితాలో తన పేరు ప్రకటించకపోవడం చాలా బాధ కల్గించిందని కొండా సురేఖ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొండా దంపతుల మీడియాతో మాట్లాడారు. జాబితాలో పేరు లేకుండా ఒక బిసి మహిళనైన తనని అవమానించారని వెల్లడించారు. వరంగల్ తూర్పు నుంచి గత ఎన్నికల్లో 50 వేల మెజార్జీ సాధించిన తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని అడిగారు. గత నాలుగేళ్లలో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని […]

హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన అసెంబ్లీ సీట్ల జాబితాలో తన పేరు ప్రకటించకపోవడం చాలా బాధ కల్గించిందని కొండా సురేఖ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొండా దంపతుల మీడియాతో మాట్లాడారు. జాబితాలో పేరు లేకుండా ఒక బిసి మహిళనైన తనని అవమానించారని వెల్లడించారు. వరంగల్ తూర్పు నుంచి గత ఎన్నికల్లో 50 వేల మెజార్జీ సాధించిన తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని అడిగారు. గత నాలుగేళ్లలో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని వివరించారు. ఈ నాలుగేళ్లలో తాను చేసిన తప్పేంటో చెప్పాలని టిఆర్ఎస్ పార్టీని నిలదీశారు. ఏ ఎన్నికలు జరిగినా తాను పార్టీ నుంచి నయాపైసా డబ్బు తీసుకోలేదన్నారు. ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర రెడ్డి ఎన్నిక సమయంలోనే తామే సొంత డబ్బు ఖర్చుపెట్టామని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తామే అంతా ఖర్చు పెట్టుకున్నామన్నారు. హరీష్ రావు తమకు అండగా నిలిచారని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయబోయే 105 మంది అభ్యర్థుల జాబితాను ఆపధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Related Stories: