నాకు, కెసిఆర్‌కు మధ్య ద్వేషం పెంచారు

ప్రధాని మోడీపై ధ్వజమెత్తిన ఎపి సిఎం చంద్రబాబు హైదరాబాద్ : విభజన హామీల పరిష్కారం గురించి పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో జరిగిన చర్చల్లో ప్రస్తావిస్తే ప్రధాని మోడీ తనకూ, కెసిఆర్‌కు మధ్య విభేదాలు పెం చేలా వ్యాఖ్యలు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ […]

ప్రధాని మోడీపై ధ్వజమెత్తిన ఎపి సిఎం చంద్రబాబు

హైదరాబాద్ : విభజన హామీల పరిష్కారం గురించి పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో జరిగిన చర్చల్లో ప్రస్తావిస్తే ప్రధాని మోడీ తనకూ, కెసిఆర్‌కు మధ్య విభేదాలు పెం చేలా వ్యాఖ్యలు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ తరహా ద్వేషభావాలను చూపలేద ని, మోడీ మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య తగు వు పెట్టేలా లోక్‌సభ సాక్షిగా వ్యాఖ్యానం చేశారని అన్నారు. తెలంగాణలో కూడా అభివృద్ధికి దోహదపడింది తెలుగుదేశమేనని, పార్టీ ప్రయోజనాల కోసం, ప్రజల సంక్షేమ కోసం ఏం చేయాలో నిర్ణయం తీసుకు ని చెబితే సహకరిస్తానని తెలంగాణ రాష్ట్ర పార్టీ నేతలకు చెప్పానన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశమని, తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని కావడాని కి అనువైన పరిస్థితులు ఇప్పుడు లేవని తెలిపారు. పార్టీ నుంచి పోయిన వారిని తిరిగి తెచ్చుకుని పార్టీని కాపాడుకోవాలని తెలంగాణ పార్టీ కమిటీకి సూచించారు. రాష్ట్ర కమిటీ తీసుకునే నిర్ణయాల వల్ల అందరికీ టికెట్లు రాకపోయినా పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఎన్‌డిఎ కూటమి నుంచి వైదొలిగిన తర్వాత కర్ణాటకలో జరిగిన ఎన్నికల సందర్భంగా అక్కడ నివసిస్తున్న తెలుగువారిని బిజెపికి ఓటు వేయవద్దని పిలుపునిచ్చామని, దీనికి వారు సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. సంఖ్యాపరంగా బిజెపికి వచ్చిన సీట్లు ఎక్కువ ఉండొచ్చుగానీ నీతి నిజాయితీగా పోరాడే తెలుగుదేశం పార్టీ నైతికంగా విజయం సాధించిందన్నారు. తెలంగాణలో సైతం తెలుగుదేశం పార్టీ ఉండడం ఒక చారిత్రక అవసరమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీని నిలబెట్టుకుంటామన్నారు. అభివృద్ధిలో ఒకటి, రెండు స్థానాల్లో తెలంగాణ, ఏపిలు ఉండాలన్నదే తన అభిమతమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏమైనా లాభం జరిగిందా అని ప్రశ్నించిన చంద్రబాబు బ్యాంకుల అవినీతి వల్ల ప్రజల్లో వాటిపైన నమ్మకమే పోయిందన్నారు. అధికారం ఉందని సిబిఐ, ఈడిని పురిగొల్పి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాల హక్కులకు, అధికారాలకు అన్యాయం చేస్తున్న కేంద్రప్రభుత్వ పెత్తనంపై రాజీలేని పోరాటం చేయాలని, ఏపి, తెలంగాణల్లో ప్రజల మనోభావాల ప్రకారం సరైన నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ తెలుగుదేశం భాగస్వామ్యం లేకుండా తెలంగాణలో ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదని, పేదల ప్రభుత్వంతో సామాజిక తెలంగాణ రావాలంటే అది తెలుగుదేశంతోనే సాధ్యమన్నారు. గత సాధారణ ఎన్నికల్లో మెజారీటి రాగానే ఆగమేఘాల మీద అధికారం చేపట్టిన కెసిఆర్ ఇప్పుడు ఏ కారణమూ లేకుండానే శాసనసభను రద్దుచేశారన్నారు.

Related Stories: