నవ వరుడు ఆత్మహత్య…

విజయనగరం: నవ వరుడు ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరంలోని బాబామెట్టలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం బాబామెట్ట ప్రాంతానికి చెందిన మదీనా అనే యువకుడుకి సాలూరుకు చెందిన ముబీనాతో ఈ నెల 2న వివాహం జరిగింది.  పెళ్లి కుమార్తె ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. దీంతో వరుడి స్వగృహంలో ఈ రోజు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో జరగనున్న రిసెప్షన్ వేడుకకు పెళ్లి కుమార్తె బంధువులు, […]

విజయనగరం: నవ వరుడు ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరంలోని బాబామెట్టలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం బాబామెట్ట ప్రాంతానికి చెందిన మదీనా అనే యువకుడుకి సాలూరుకు చెందిన ముబీనాతో ఈ నెల 2న వివాహం జరిగింది.  పెళ్లి కుమార్తె ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. దీంతో వరుడి స్వగృహంలో ఈ రోజు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో జరగనున్న రిసెప్షన్ వేడుకకు పెళ్లి కుమార్తె బంధువులు, పెళ్లి కుమారుడి బంధుమిత్రులు ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు  వరుడు తన గదిలో ప్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చీపురుపల్లి మండలం పెదనడిపల్లిలో వీఆర్వో గా పని చేస్తున్నాడు. నవ వరుడు మదీనా ఆత్మహత్యతో ఇరు కుటుంబాల్లో విషాదం ఛాయలు అలముకున్నాయి

Related Stories: